Kajal Aggarwal : ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడా ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతకొద్దినెలలుగా బేబీ బంప్‌తో సోషల్ మీడియాలో సందడి చేసిన కాజల్.. చివరికి తన ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే గుడ్ న్యూస్ చెప్పింది. కాజల్ అగర్వాల్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు వార్త వైరల్ అవుతోంది. ఈ రోజు ఉదయం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
అధికారికంగా కాజల్ కుటుంబ సభ్యులు ఎవరూ ఈ విషయంపై స్పందించలేదు. కాజల్ బిడ్డకు జన్మనిచ్చిందనే వార్త తెలియగానే చందమామ ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు. సోషల్ మీడియా వేదికగా కాజల్, గౌతమ్ కిచ్లుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ బేబీ బంప్, ఆమె బాడీ షేమింగ్ పై అనేక విధాలుగా ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ కాజల్ కుంగిపోకుండా తనపై బాడీ షేమింగ్ చేసిన నెటిజన్లకు అదే రీతిలో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 2020లో గౌతమ్ కిచ్లును పెళ్లాడిన కాజల్ ఆ తర్వాత సినిమాల్లోనూ నటనను కొనసాగించింది. కాకుంటే ఎక్కువగా తన ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇచ్చింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూనే తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.
Read Also : Kajal agarwal emotional post: డియర్ గౌతమ్.. మన జీవితాల్లో మార్పులు రాబోతున్నాయంటూ కాజల్ పోస్ట్!