...

Rain in hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. పొంగుతున్న డ్రైనేజీలు!

Rain in hyderabad: హైదరాబాద్ లో ని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురరు గాలులతో కూడాన వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు విరిగిపోయాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, చిలకలగూడ, బోయిన్ పల్లి, తిరుమల గిరి, అల్వాల్, బేగంపేట్, సైదాబాద్, చంపాపేట, సరూర్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, దిల్ సఖ్ నగర్, నాగోల్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురింసింది.

వర్షపు నీరంతా రోడ్లపైకి వచ్చి చేరింది. కొన్ని చోట్ల డ్రైనేజీలన్నీ పొంగి పొర్లాయి. చైతన్య పురి, కొత్తపేటలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంజాగుట్ట కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్ వద్ద మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. ఈదురు గాలులకు మైత్రీవనం స్టేట్ హోమ్ వద్ద రోడ్డుపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది.