Big Boss Non Stop Telugu : బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ గా 24 గంటల పాటు ఓటీటీలో ప్రసారమవుతూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ కార్యక్రమం ఏడు వారాలు పూర్తి చేసుకుని ఏడు మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు.అయితే వీరిలో బిందు మాధవిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన బాబా భాస్కర్ మాస్టర్ సేవ్ చేశారు.

Big Boss Non Stop Telugu
మిగిలిన ఐదు మంది కంటెస్టెంట్ లలో అనిల్, అఖిల్, అజయ్, ఆషురెడ్డి, హమీదా ఈవారం నామినేషన్ లో ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న వీరిలో ఓటింగ్ పరంగా అనిల్, అఖిల్ ముందు వరుసలో ఉన్నారు. ఆ తరువాత అషు రెడ్డి మూడవ స్థానంలో ఉండగా, హామీదా నాలుగవ స్థానంలో ఉన్నారు.ఓటింగ్లో అజయ్ పూర్తిగా వెనుకబడి ఉండటంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినబడుతున్నాయి.
ఈ విధంగా ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్నటువంటి అజయ్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ వీడనున్నారు. ఇకపోతే అఖిల్ గ్యాంగ్ లో కీలకంగా ఉన్నటువంటి అజయ్ ను అఖిల్ బీభత్సంగా ఉపయోగించుకున్నారు. చివరికి అఖిల్ ప్లేట్ ఫిరాయించి అజయ్ ను దారుణంగా మోసం చేశారని ఆయన అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సేవ్ ట్యాగ్ ఎవరికైనా ఇవ్వాలని బిగ్ బాస్ సూచించినప్పుడు అఖిల్ అజయ్ కి కాకుండా మిత్రా శర్మకి సేవ్ ట్యాగ్ ఇచ్చి అజయ్ కు షాక్ ఇచ్చారు. మొత్తానికి అఖిల్ చేతిలో దారుణంగా మోసపోయిన అజయ్ ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో మరికొన్ని గంటల్లో తెలియనుంది.
Read Also :Big Boss Akhil : ప్లేటు మార్చిన అఖిల్… తనని దూరం పెడుతూ మిత్రకి సేవ్ ట్యాగ్!