Dosthan Movie Review : లవ్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘దోస్తాన్’ మూవీ రివ్యూ

Dosthan Movie Review _ Dosthan telugu movie review and Rating in telugu
Dosthan Movie Review _ Dosthan telugu movie review and Rating in telugu

Dosthan Movie Review : శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 6 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

Dosthan Movie Review _ Dosthan telugu movie review and Rating in telugu
Dosthan Movie Review _ Dosthan telugu movie review and Rating in telugu

నటీ నటులు : 
సిద్ స్వరూప్ , ఆర్. కార్తికేయ, రియా , నిత్య, చంద్రసే గౌడ, రమణ మహర్షి, మూస ఆలీ ఖాన్ తదితరులు

Advertisement

సాంకేతిక నిపుణులు : 
బ్యానర్ : శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్
సినిమా : “దోస్తాన్”
రివ్యూ రేటింగ్ : 3/5
దర్శక, నిర్మాత : సూర్యనారాయణ అక్కమ్మగారు
మ్యూజిక్ : ఏలెందర్ మహావీర్
డి. ఓ. పి : వెంకటేష్ కర్రి, రవి కుమార్
ఎడిటర్ : ప్రదీప్ చంద్ర
పి . ఆర్ ఓ : మధు వి. ఆర్
ఫైట్ మాస్టర్ : విక్కీ, అజయ్
అసిస్టెంట్ డైరెక్టర్ : కౌసిక్ కాయల

కథ :
వైజాగ్ సిటీలో భాయ్ (చంద్రసే గౌడ) అనే వ్యక్తి డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ వంటి అక్రమ బిజీనెస్ లు చేస్తూ చలామణి అవుతుంటాడు. అతను గతంలో చెట్టు కింద పాలిస్తున్న నిస్సహాయరాలైన ఓ తల్లిని తన గ్యాంగ్ తో రేప్ చేసి చంపేస్తాడు. అక్కడే ఉన్న మరో అనాద జై (కార్తికేయ) ఆ చంటి బిడ్డ ఏడుపు వినిపించి చూడగా అక్కడ ఆ పిల్లాడి తల్లి చనిపోయి ఉంటుంది.. తన లాగే అనాధగా ఉన్న పిల్లాడిని చేరదీస్తాడు. ఏడుస్తున్న పిల్లాడి పాలకోసం వీధిలో ఆడుక్కంటున్న జై ను చూసి మెకానిక్ సెడ్ ఓనర్ అయిన బాబా (రమణ మహర్షి ) చేరదీసి షెడ్లో మెకానిక్ పని నేర్చుకోమని చెపుతాడు. అలాగే పెద్దోడికి జై( కార్తికేయ ), చిన్నోడికి రామ్ (సిద్ స్వరూప్) గా నామకారణం చేస్తాడు.

Advertisement

వీరు పెద్ద అయిన తరువాత ఆ పెద్దాయన చనిపోవడంతో జై ను చదువుకోమని చెప్పి రామ్ మెకానిక్ గా మారతాడు. ఈ క్రమంలో జై కు నిత్య (ప్రియ వల్లబి) పరిచయం అవ్వగా, రామ్ (సిద్ స్వరూప్) కు రియా (ఇందు ప్రియ) పరిచయం ఆవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇలా వీరి లైఫ్ హ్యాపీ గా సాగిపోతున్న వీరి జీవితంలోకి మళ్ళీ భాయ్ ప్రవేశిస్తాడు. ఆ భాయ్ వల్ల జై, రామ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరికి భాయ్ పై వీరిద్దరూ ఎలాంటి రివేంజ్ తీర్చుకొన్నారు? అనేది తెలుసుకోవాలంటే “దోస్తాన్” సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు : 
జై పాత్రలో కార్తికేయ , రామ్ పాత్రలో సిద్ స్వరూప్ లు హీరోగా నటించిన వీరిద్దరూ కొత్త వారైనా ఎమోషన్, లవ్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని రకాలుగా చక్కటి పెర్ఫార్మన్స్ చూపిస్తూ త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. హీరోయిన్స్ గా నటించిన నిత్య, రియా పాత్రలలో నటించిన ఇందు ప్రియ, ప్రియ వల్లబి తమ లిద్దరూ గ్లామర్స్ లుక్స్ తోపాటు నటనపరంగా బాగా నటించారు. ఇందులో వీరిద్దరి జోడీలు చాలా క్యూట్ గా ఉన్నాయి .  బాయ్ పాత్రలో నటించిన చంద్రసే గౌడ నెగటివ్‌ షేడ్‌ పాత్రలో ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. నిత్య తండ్రి పాత్రలో నటించిన మూస ఆలీ ఖాన్ తో పాటు ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

Advertisement

సాంకేతిక నిపుణుల పనితీరు : 
డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ అంశాలను సెలెక్ట్ చేసుకొని వాటికి చక్కటి ఎంటర్టైన్మెంట్ ను జోడిస్తూ లవ్, ఎమోషన్స్ ను జోడించి ప్రేక్షకులకు బోర్‌ ఫీలింగ్‌ లేకుండా  అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా తెరకెక్కించాడు.అలాగే అన్న , తమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు సూర్యనారాయణ అక్కమ్మగారు. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేసిన వెంకటేష్ కర్రి, రవికుమార్ ల కెమెరామెన్‌ పనితనం బాగుంది.

ఏలెందర్ మహావీర్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌. చల్ చల్ ఇది హీరోయిజం చల్ చల్ ఇది నాలో నిజం, కురిసే మేఘం, ఓ పిల్లా పాటలు బాగున్నాయి. ప్రదీప్ చంద్ర ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఇందులోని ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత సూర్య నారాయణ అక్కమ్మ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాను అందరూ ఫ్యామిలీ తో కలసి చూడొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు, లవ్, ఫ్రెండ్షిప్ ఇలా మూడు జోనర్స్ మీద తీసిన “దోస్తాన్” సినిమా అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంది..

Advertisement

Read Also : AP04 Ramapuram Movie Review : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘AP04 రామాపురం’ మూవీ రివ్యూ 

Advertisement