Palmistry : అర చేతుల్లోని గీతలను చూసి భూతః భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పే శాస్త్రాన్ని హస్తసాముద్రికం అంటారు. దీనిని ఇంగ్లీష్‌లో పామిస్ట్రీ అని పిలుస్తారు. అరచేతిలోని గీతలు, వాటి వంపులు చూసి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పేస్తారు హస్తసాముద్రిక నిపుణులు. అరచేతుల్లోని గీతలు ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవు. కానీ కొన్ని గీతలు నిర్ధిష్టంగా ఉంటాయి. వాటి ఆధారంగానే హస్తసాముద్రిక నిపుణులు భవిష్యత్తును చెప్పేస్తారు. ఈ గీతలను బట్టి పనుల్లో విజయం, వివాహం, కెరీర్, సంపద, ఆరోగ్యం ఇలా చాలా అంశాలను చెబుతారు. అరచేతిలోని ఈ అడ్డదిడ్డమైన గీతలు కొందరిలో కొన్ని రకాల గుర్తులను ఏర్పరుస్తాయి.
![Palmistry : మీ చేతిలో ఈ గుర్తు ఉందా.. ఒకసారి చూసుకోండి! do-you-have-this-type-of-symbol-on-your-palms-in-telugu](https://tufan9.com/wp-content/uploads/2022/04/do-you-have-this-type-of-symbol-on-your-palms.jpg)
అయితే.. మీ అర చేతిలో ఈ గుర్తు ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఇది ఉంటే ఎంతో అదృష్టవంతులు అవుతారని హస్తసాముద్రిక శాస్త్రం చెబుతోంది. అదే X గుర్తు. కుడి లేదా ఎడమ అరచేతిలోని గీతలు ఈ X ఆకారం గుర్తును ఏర్పరిస్తే ఎంతో అదృష్టమట. ఈ గుర్తు అలెగ్జాండర్ చేతిలో ఉందని చెబుతారు నిపుణులు. ఈ లైన్ ప్రపంచ జనాభాలో కేవలం 3 శాతం మందికి మాత్రమే ఉంటుంది. రెండు అరచేతుల్లోని రెండు సమాంతర వక్రరేఖల మధ్య ఈ గుర్తు ఉంటే.. అది విజయానికి సంకేతం. అలెగ్జాండర్ ది గ్రేట్ అరచేతిలో X అక్షరం ఉండేదని పురాతన నివేదికలు చెబుతున్నాయి. కొంత మంది వ్యక్తుల్లో ఈ గుర్తు చాలా అరుదుగా కనిపిస్తుంది.
అరచేతిలో ఈ గుర్తు ఉన్న వాళ్లు ఏ పని చేసినా వారిని విజయం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ గుర్తు వారికి విజయాన్ని, శ్రేష్టతను తెస్తుంది. అబ్రహం లింకన్, వ్లాదిమర్ పుతిన్ ఈ అరుదైన గుర్తు ఉన్నవారే. ఈ వ్యక్తులు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారు తెలివైన, సహజమైన, షార్ప్, దయకలిగినవారు. అయితే ఈ X గుర్తు ఉన్న వారికి ప్రతీకారేచ్ఛ ఎక్కువగా ఉంటుందట. వారికి ఎవరైనా ద్రోహం చేస్తే ప్రతీకారం తీర్చుకునే వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలి పెట్టరు
Read Also : Palmistry : అరచేతిలో ఈ రేఖ ఉంటే భవిష్యత్తులో కోటీశ్వరులవుతారు.. చూస్కోండి!