Nandini reddy comments on sam: సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి ఎప్పటి నుంచో మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో జబర్దస్త్, ఓ బేబి సినిమాలు వ్చచాయి. ఆహాలో వచ్చిన సమంత టాక్ షోని కూడా నందిని రెడ్డియే డైరెక్ట్ చేసినట్లు సమాచారం. అయితం గతంలో కూడా వీరిద్దరూ ఒకరితో ఒకరికున్న అనుబంధం గురించి పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. అయితే సమంత ఇటీవల నందిని రెడ్డి బర్త్ డే సందర్భంగా సామ్ ఓ ట్వీట్ చేసింది. దాన్ని చూస్తే… నందిని సామ్ కు ఎంత సపోర్ట్ ఇచ్చిందో తెలుస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ.. నందిని రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
“మేమిద్దరం ఒకేసారి కెరియల్ మొదలు పెట్టాం. ఇద్దరం కలిసి జబర్దస్త్ సినిమా చేశాం. ఆ సమయంలో సామ్ నాకు బాగా క్లోజ్ అయింది. ఇక్కా చెల్లెల్లలాగా ఉండే వాళ్ల. ఆదే టైంలో సమంతకు కొన్ని సమస్యలు వచ్చి. ఆరోగ్య సమస్యలు కూడా. దీంతో సామ్ కి నేను సపోర్ట్ చేశారు. అప్పుడు మరింత క్లోజ్ అయ్యాం. ఇప్పటికీ ఒకరి విషయంలో ఒఖరం సపోర్ట్ చేసుకుంటాం. కానీ తన పర్సనల్ విషయాల్లో నేను తలదూర్చను” అని నందిని రెడ్డి తెలిపింది.