Devatha: బుల్లితెరలో ఆద్యంతం ఉత్కంఠతతో కొనసాగుతున్న సీరియల్ దేవత. మరి ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ విడుదల అయ్యింది. ఆ ఎపిసోడ్‌లోని లేటెస్ట్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
నా ప్రేమను నా ఇష్టాలు ఆయుధంగా చేసుకుని నా కాళ్లు చేతులు కట్టేస్తున్నావ్ కదూ.. నీ విషయంలో జరిగినా ఊరుకున్నా కానీ నా బిడ్డ విషయంలో నా బిడ్డను నాకు దూరం చేస్తా అంటే చూస్తూ ఊరుకోను అంటూ ఆదిత్య బాధపడూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో సత్య వచ్చి ఏంటి ఆదిత్య అంతలా ఆలోచిస్తున్నావ్ అంటుంది. అబద్దాలు కూడా చాలా బాగా చెప్తున్నావ్ అంటుంది దానికి ఆదిత్య షాక్ అవుతాడు. అసలు సమస్య నీలోనే ఉందా ఆదిత్య అంటుంది సత్య దానికి ఆదిత్య షాక్ అవుతాడు. ఇంక మనం బిడ్డల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నా బిడ్డ ఇంటికి అందిరి బాధ తీరుస్తుంది అని చెప్పి వెళ్లి పడుకుంటాడు.
సీన్ కట్‌చేస్తే ఆదిత్య దేవి వాళ్ల స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అంతలో దేవీ చిన్మయిలను మాధవ్ కారులో తీసుకువచ్చి స్కూలు దగ్గర దిగబెట్టి వెళ్తాడు. ఆదిత్యని చూసి దేవి ఆదిత్య దగ్గరకు వెళ్లి మా అమ్మ తప్పేమిలేదు మా అమ్మను ఏమి అనకండి మా అమ్మ ఒట్టు వేయించుకోలేదు నేనే నీతో దోస్త్ కటీఫ్ చేస్తాని మా అమ్మకి ఒట్టు పెట్టిన మా అమ్మ మన దోస్తీ వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు అంటుంది దేవీ. మీరు మా స్కూలుకి మా ఇంటికి నాకోసం రావద్దు అంటుంది వచ్చినా నేను మీతో మాట్లాడను కలవను అంటుంది. నిన్ను చూడకుండా మాట్లాడకుండా నేనెలా ఉండగలనమ్మా అంటాడు ఆదిత్య దానికి దేవి నేనేమైనా నీ కూతురినా నాతో మాట్లాడకుండా ఉండడానికి అని ఆదిత్యను అడుగుతుంది. మీతో దోస్తానా కుదరదు సారూ నేను మీతో దోస్తానా చేసి మా అమ్మను బాధపట్టలేను అని దేవి ఆదిత్యతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తరువాత సత్య రాధ వాళ్ల ఇంటికి వస్తుంది. అక్కడి వెళ్లేసరికి మాధవ్ రా సత్య అంటాడు. ఇంక దేవీ ఆదిత్యను కలవదు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని వెళ్లిపోతాడు. అందుకేనా ఆదిత్య అంత డల్‌గా ఉన్నాడా అని అంటుంది. ఏంటక్కా ఆదిత్య డల్‌గా ఉంటే మీరు సంతోషిస్తున్నారా అంటుంది. నా బిడ్డ నా మాట వింటుంది మాట ఇచ్చిందంటే మాటమీద ఉంటుంది అంటుంది సత్యతో రాధ. ఆదిత్య కూడా మొండి వాడు దేవిని అంత తేలికగా వదలలేడు అంటుంది సత్య.
సరే ఇదంతా ఎందుకులే కానీ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అక్క ఆదిత్యలో సమస్య ఉంది దాని కోసం మందులు వాడుతున్నాడు అని చెప్పా కదా అది అబద్దం అక్క ఆదిత్య అసలు మందులు వాడడం లేదు అక్క నేను ఆదిత్యకు తెలియకుండా మరల ఒకసారి చెక్‌అప్ చేయించుకోవాలి అనుకుంటా దానికి మీరు తోడుగా వస్తారా అని రాధను అడుగుంతుంది. దానికి రాధ అలా చెయ్యకు ఆ విషయంలో భర్తలు అబద్ధం చెప్పరు నువ్ అలా చేశావంటే నీ భర్తను నువ్ అనుమానపడుతున్నట్టే అంటూ మనసులో నీకు అసలు నిజం తెలిస్తే తట్టుకోలేవు సత్య అంటూ కంగారుపడుతూ బాధపడుతుంది.
సీన్‌కట్ చేస్తే పటేలు పక్కింట్లోని ఒక ఆంటీకి సైట్ వెయ్యడాన్ని బాష కమల చూస్తారు. నీ పని ఇలా ఉందా ఆగు చెప్తా అని బాష వెళ్లి పటేల వాళ్ల భార్యను తీసుకువస్తాడు. తన భర్త పక్కింటి ఆవిడకు సైట్‌వెయ్యడం చూసిన ఆమె నన్ను గుర్తుపట్టనంతగా లీనమయ్యావా అంటూ మొట్టికాయ వెస్తుంది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి తదుపరి ఎపిసోడ్ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Tufan9 Telugu News And Updates Breaking News All over World