పుష్ప సినిమా రిలీజ్ అయి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ… ఇంకా పుష్ప ఫీవర్ ప్రజలను వదలట్లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా పాటలు, డైలాగ్ లు జనాల్లో నోట్లలో విపరీతంగా నానుతున్నాయి. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ పాటలకు డ్యాన్స్ లు చేస్తూ… అందరినీ అలరిస్తున్నారు. అయితే తాజాగా ఊ అంటవా మావా.. ఊహూ అంటావా మావా అంటూ వచ్చే పాటకు క్రికెటర్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తమ జట్టు స్టార్ ఆల్ రౌండర్, కొత్త పెల్లి కొడుకు గ్లెన్ మ్యాక్స్ వెల్ కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. భారత మూలాలున్న వినీ రామన్ ను పెళ్లాడి మాక్సీ తమిళనాడు అల్లుడయ్యాడు. వీరి వివాహం జరిగిన నెల రోజులకు గాను ఓ ఫంక్షన్ ను నిర్వహించారు. అందులో భార్యతో పాటు పాల్గొన్న విరాట్ కోహ్లీ ఈ పాటకు డ్యాన్స్ చేశారు.