Sri Reddy Video : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అందాల బ్యూటీ శ్రీరెడ్డి.. ఆమె నోరు తెరిస్తే చాలు.. అవతలి వారి వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. ఆమె మాటలు చొరకత్తుల్లా ఉంటాయి. ఆమె నోటు దురుసుతనం తెలిసినవాళ్లు ఎవరూ శ్రీరెడ్డి జోలికి వెళ్లాంటే భయపడతారు. అది శ్రీరెడ్డి రేంజ్.. అలాంటి శ్రీరెడ్డి ఈ మధ్యన ట్రెండ్ మార్చింది. సముద్రం ఒడ్డున వంటలు చేస్తుంది.. ఆ వంటలను తింటూ యూట్యూబ్ లో పోస్టు చేస్తోంది.
ఈ అమ్మడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి తన వీడియోలను అందులో పోస్టు చేస్తూ తన అభిమానులకు వినోదాన్ని అందిస్తోంది శ్రీరెడ్డి. మొన్నటివరకూ వంటలతో బిజీగా గడిపిన శ్రీరెడ్డి జస్ట్ ఫర్ ఏ ఛేంజ్ అన్నట్టుగా సడన్‌గా గోవాలో ప్రత్యక్షమైంది. అక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బాగా నచ్చిన ఫేవరెట్ ప్లేసులో దిగిపోయి అందాలను ఆరబోస్తూ తెగ రచ్చ చేస్తోంది. ఇదే ఎన్టీఆర్ ఫేవరెట్ ప్లేస్.. అక్కడే నేనూ ఎంజాయ్ చేస్తున్నానంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
Sri Reddy Video : గోవాలో శ్రీరెడ్డి అందాల ఆరబోత.. వీడియో

ఈ విహారయాత్రలో శ్రీరెడ్డి ఓ పెద్ద విల్లాను తీసుకుని అందులో ఏకంగా హోం టూర్ చేసేసింది. ఒకవైపు వంటలు చేస్తూనే.. మరోవైపు విహరయాత్రలతో లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది శ్రీరెడ్డి.. గోవాలో శ్రీరెడ్డి రచ్చ చేసిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేయడంతో భారీగా వ్యూస్ వస్తున్నాయి. కామెంట్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి.. ఇది కదా.. శ్రీరెడ్డి క్రేజ్ అంటే.. మీరూ కూడా శ్రీరెడ్డి వీడియోను చూసేయండి..
