Chanakya nithi : ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం ఇప్పటికీ ఎంతో మంది అనుసరిస్తున్నారు. ఈ నీతి శాస్త్రం ప్రతీ మనిషి మంచి మార్గంలో ముందుకు వెళ్లేలా చేస్తుంది. అయితే ఏ భర్త అయినా తన భార్యకు ఈ నాలుగు విషయాల గురించి అస్సలే చెప్పకూడదని చెప్పాడు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. భర్త తన సంపాదన గురించి భార్యకు అస్సలే చెప్పకూడదట. అయితే సంపాదన గురించి తెలిస్తే.. వాటిపై ఆమె పెత్తనం చేయడం ప్రారంభిస్తుందని చాణక్యుడు వివరించాడు. అలాగే మీరు ఖర్చు చేసే ప్రతీ రూపాయి గురించి అరా తీస్తుందని వివరించాడు.
2. మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు అవమానం జరిగితే.. దాన్ని మనుసులోనే ఉంచుకోవాలని కానీ భార్యకు అస్సలే చెప్పకూడదట. ఎందకుంటే మీ మధ్య ఏదైనా చిన్న గొడవ జరిగినా ఆ అవమానం గురించి గుర్తు చేస్తూ.. ఇబ్బంది పెడుతుందని ఆయన వివరణ.
3. అలాగే ధాన ధర్మాల విషయాలకు గురించి కూడా భర్యతో చెప్పకూడదట. దాన ధర్మాలు రహస్యంగా చేస్తేనే ఆ పుణ్యం దక్కుతుందట.
4. భర్తకు దేని గురించి అయినా బలహీనత ఉంటే తనలోనే దాచుకోవాలి. మీ బలహీనత గురించి మీ భార్యకు అస్సలే తెలియనీయకండి. దాని గురించి తెలిస్తే… గొడవ పడ్డప్పుడు దానిపై దాడి చేస్తుందని వివరించాడు.
Read Also : Chanakya neethi: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో చూడాల్సిన లక్షణాలు ఇవే..!