Chanakya nithi : ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని పద్ధతులను కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి దర్మాలు పాటించడం వల్ల మనషి హాయిగా, సంతోషంగా జీవించగలడో ఆచార్య చాణక్యుడు ప్రపంచానికి చాటి చెప్పాడు. ముఖ్యంగా ఈ ఐదు విషయాలను పాచించకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు. అయితే ఆ ఐదు సూత్రాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- అప్పుడప్పుడూ వచ్చే వరదలకు ఉప్పొంగే నదులు, వంతెలను ఎప్పుడూ నమ్మకూడదని తెలిపారు. వాటి వల్ల ప్రాణాలే కోల్పోవలసి వస్తుందని వివరించారు.
- ఆయుధాలు కల్గిన వారిని అస్సలే నమ్మకూడదని తెలిపారు. అలాంటి వారి కోసం వస్తే ఏం చేయడాకైనా వెనుకాడరని స్పష్టం చేశారు.
- పెద్ద పెద్ద గోర్లు, కొమ్ములు కల్గిన వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దన్నారు. ఎవి ఎప్పుడు మనల్ని అటాక్ చేస్తాయో మనం ఊహించలేమని తెలిపారు.
- చంచల స్వభావం గల స్త్రీలను నమ్మడం అంత పెద్ద తప్పు ఇంకోటి ఉండదన్నారు. వారు ఎప్పటికప్పుడు మాట మారుస్తూ.. మిమ్మల్ని కష్టాల పాలు చేసే అవకాశం అధికంగా ఉంటుంది.
- ఉన్నత కులస్థులను గుడ్డిగా విశ్వసించకూడదని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. వీరిలో కొందరు వ్యక్తులు తన అధికారం కోసం ఎవరినైనా ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉంటారని ఆయన విశ్వాసం.
Read Also : Chanakya nithi: భార్యతో భర్త అస్సలే చెప్పకూడని విషయాలేంటో తెలుసా?