...

Bigg Boss winner : బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ గెలుచుకున్న బిందు.. ఎమోషనల్ స్పీచ్..!

Bigg Boss winner : ఓటిటిలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ నిన్నటితో ముగిసింది. ఈ బిగ్బాస్ నాన్స్టాప్ సీజన్ పోటీలో ప్రారంభమైనప్పుడు 24 గంటల సేపు ఎవరు దీనిని చూస్తారు అంటూ విమర్శలు వచ్చాయి. కానీ నెమ్మదిగా ప్రేక్షకులు బిగ్ బాస్ చూడటానికి అలవాటు పడ్డారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ మొదలయిన నాటి నుండి ఎంతో ఉత్కంఠగా రియాలిటీ షో ని చూడటం మొదలుపెట్టారు. 18 మంది కంటెస్టెంట్ ల తో ప్రారంభమైన ఈ రియాలిటీ షో లో మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఒక మహిళ కంటెస్టెంట్ టైటిల్ అందుకుంది.

Bigg Boss winner  Bindhu Madhavi
Bigg Boss winner Bindhu Madhavi

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో అఖిల్, బిందుకి మధ్య టైటిల్ కోసం గట్టి పోటీ నడిచింది. వీరిద్దరూ టైటిల్ కోసం గట్టి పోటీ ఇవ్వటంతో చివరి నిమిషం వరకు ఎవరు ఈ సీజన్ విన్నర్ అనే విషయం గురించి చాలా ఉత్కంఠ నెలకొంది. లాస్ట్ రౌండ్ లో నాగార్జున గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో హౌస్ లోకి వచ్చి ఇందులో 10 లక్షలు క్యాష్ ఉందని తీస్కుందని, మీలో ఎవరైనా ఇందులో ఉన్న ఎమౌంట్ ని తీస్కోవచ్చని చెప్పాడు. కానీ అఖిల్, బిందు ఇద్దరూ దాన్ని తిరస్కరించారు. దీంతో నాగార్జున ఇద్దరిని స్టేజి మీదకు తీసుకు వెళ్లి టైటిల్ విన్నర్ ని అనౌన్స్ చేయటానికి చాలా సమయం ప్రేక్షకులను టెన్షన్ పెట్టి చివరికి టైటిల్ విన్నర్ గా బిందు చెయ్యి పైకి లేపుతాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ప్రేక్షకులతో పాటు విందు అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో బిందుమాధవి సంతోషం వ్యక్తం చేసింది. బిందు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. ” కష్టపడి నిరుత్సాహ పడకుండా ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా విజయం వరిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ రాకుండా ఎదురుచూస్తున్న వాళ్లందరికీ కూడా ఈ టైటిల్ ని అంకితం ఇస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. అందుకు నేనే ఉదాహరణ.. తెలుగులో అవకాశాలు లేనప్పుడు తమిళ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేశాను. కానీ అక్కడ కూడా పరాజయం ఎదురైంది. అంతటితో ఆగకుండా తెలుగులో అవకాశం వచ్చినప్పుడు ఇందులో పాల్గొని ఈ రోజు టైటిల్ సొంతం చేసుకున్నాను. ఈ ట్రోఫీ తీసుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ బిందుమాధవి చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది.

Read Also : Papaya Benefits : బొప్పాయిలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి తప్పక తెలుసుకోండి..!