Papaya Benefits : బొప్పాయి తింటే ఎన్నొ ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? బొప్పాయి చేసే మేలు అంతాఇంతా కాదండోయ్.. రోగాలబారినుంచి రక్షించడంలో బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. బొప్పాయిలో అనేక షోషక విలువలు ఉన్నాయి. బొప్పాయి పండు, ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయిలో సి విటమిన్, పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. కరోనాను నివారించేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే తప్పనిసరిగా బొప్పాయి తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
భోజనం చేసిన తర్వాత బొప్పాయి తీసుకోవడం ద్వారా తేలికంగా తిన్న ఆహారం జీర్ణమవుతుంది. అంతేకాదు.. కడుపులోని పేగుల్లో పేరుకుపోయిన విషపదార్థాలను సైతం బొప్పాయి కడిగిపారేస్తుంది. బొప్పాయిలో పొటాషియం, మినరల్స్, ప్లేవనాయిడ్స్, కాపర్, మెగ్నిషియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. డెంగీ జ్వరంతో బాధపడేవారిలో ప్లేట్ లేట్స్ తగ్గిపోతాయి. ఈ ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినప్పుడు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. అప్పుడు ప్లేట్ లెట్స్ వేగంగా పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. బొప్పాయి ఆకుల రసాన్ని తాగినా కూడా తొందరగా ప్లేట్ లెట్స్ సంఖ్య పెరిగిపోతుంది.
అయితే, బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బొప్పాయి ఎక్కువగా తీసుకున్నా బరువు పెరగరు. చెడు కొవ్వును కరిగిస్తుంది. గుండెకు కావాల్సిన మంచి రక్తాన్ని చక్కగా సరఫరా చేస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఉంటే.. బొప్పాయి రోజూ తీసుకోవాలి. ఇలా చేస్తే.. కొద్దిరోజుల్లోనే మూత్రపిండాల్లో రాళ్లను పిండి చేసేస్తుంది. అలసట, నీరసంతో బాధపడేవారు కూడా బొప్పాయి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. కాన్సర్ కణాలను నాశనం చేయగల గుణాలు బొప్పాయిలో పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో లూటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. కొలన్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లను కూడా బొప్పాయి నివారిస్తుంది. బొప్పాయి తినడం ద్వారా కళ్లు చల్లగా ఉంటాయి. యాపిల్ తినడం కన్నా బొప్పాయి తింటే చాలా మంచిది.. ఇ విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది.
చర్మం సున్నితంగా, మృదువుగా మారడానికి బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. బొప్పాయి రుచిగా ఉంటుంది.. అలా అనీ అతిగా తినకూడదు.. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా బొప్పాయిని ప్రెగ్నెన్సీతో ఉన్నవారు అసలే తినకూడదు. ఎందుకంటే.. బొప్పాయి బాగా వేడి చేస్తుంది. గర్భిణీలు బొప్పాయి తింటే కడుపులోని శిశువుకు ప్రమాదం. అందుకే బొప్పాయి తినొద్దని అంటారు. బొప్పాయి తింటే అబార్షన్ అయ్యే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బొప్పాయిని నిత్యం తినేవారిలో చర్మం రంగు మారుతుంది. కళ్లు తెల్లగా ఉంటాయి. చేతులు ఆకుపచ్చగా మారుతాయి.. ఫలితంగా కామెర్లు వచ్చే రిస్క్ కూడా ఉంది. అందుకే వారానికి రెండు నుంచి మూడు బొప్పాయి కన్నా ఎక్కువగా తినకూడదని గుర్తించుకోండి..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world