Hemachandra -Sravana Bhargavi : టాలీవుడ్ లో స్టార్ సింగర్స్ గా గుర్తింపు పొందిన హేమచంద్ర, శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకం5గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో పాటలు పాడి సింగర్లుగా తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మా టీవీలో ప్రసారమైన సూపర్ సింగర్స్ షో లో ఇద్దరు పాల్గొన్నారు. ఆ సమయంలో ఇద్దరిమద్య ఏర్పడిన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. కొంత కాలం ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అంగీకారంతో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2013 లో పెళ్లి చేసుకున్న ఈ సింగర్స్ ఇద్దరు ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. వీరికి ఒక పాప కూడా ఉంది .
కానీ కొన్ని రోజులుగా వీరిద్దరికీ సంబందించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. శ్రావణ భార్గవి,హేమచంద్ర విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది సెలెబ్రిటీలు విడాకుల తీసుకున్నారు. వారి బాటలోనే వీరు కూడా విడాకులు తీసుకుంటున్నారు అంటూ సమాచారం. అంతే కాకుండా గత కొంత కాలంగా వీరిద్దరు వేరువేరుగా ఉంటున్నట్టు సమాచారం. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు విడిపోవటానికి గల కారణం ఏంటి అని అందరూ ఆలోచనలో పడ్డారు.
ఇటీవల వీరి విడాకులకు గల అసలు కారణం బయటపడింది. సింగర్స్ గా బాగా పాపులర్ అయిన వీరిద్దరికీ ఒక స్టార్ సింగర్ కామన్ ఫ్రెండ్ గా ఉంది. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తితో హేమచంద్ర మాట్లాడిన మాటలకు సంభందించిన ఒక వాయిస్ క్లిప్ విన్న శ్రావణ భార్గవి హేమచంద్ర అసలు రంగు తెల్సుకుని అతని నుండి విడిపోవాలని నిర్ణయించుకుంది అంటూ సమాచారం. అయితే ఈ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో లో వైరల్ గా మారినా కూడా హేమచంద్ర, శ్రావణ భార్గవి నుండి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఈ వార్తల్లో నిజం లేదు అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. మరి వీరి విడాకుల వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించక తప్పదు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World