...

Anchor srimukhi: హాట్ హాట్ డ్రెస్సులో యాంకర్ శ్రీముఖి.. నెటిజెన్ల కామెంట్లు!

Anchor srimukhi: తెలుగు బుల్లి తెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం వరసుగా షోలు చేస్తూ మరింత సందడి చేస్తోంది. అంతే కాదండోయ్… సోషల్ మీడియాలో శ్రీముఖి ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ యాడ్ వివాదాస్పదంగా మారింది. ఈ యాడ్ చేస్తున్నప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సుపై ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి యాడ్స్ ఎందుకు చేస్తున్నావంటూ మండిపడుతున్నారు.

శ్రీముఖి ఓ గేమ్ యాప్ పై యాడ్ చేసింది. ఈ యాడ్ కోసం ఆమె గ్రీన్ కలర్ డ్రెస్సులో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న డ్రెస్సుపై పలువురు నెటిజెన్లు… అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంత డబ్బులిస్తే మాత్రం ఇలాంటి బట్టలు వేసుకుంటావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ను ప్రమోట్ చేస్తావా అంటూ ఓ నెటిజెన్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరేమో బెట్టింగ్ యాప్స్ ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే శ్రీముఖి ఇప్పటి వరకు ఈ వార్తలపై స్పందించలేదు.