Mango : వేసవి కాలం ప్రారంభం కాగానే అందరికీ గుర్తొచ్చేవి మామిడి పండ్లు, తాటి ముంజలు, కర్భుజా, తర్చుజాలు. అయితే సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిలో ఉన్న విత్తనాలు మాత్రం పడేస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో విపరీతంగా మామిడి పండ్లు తింటారు. ఆ తర్వాత ఆ టెంకులను పడేస్తారు. కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. మామిడి టెంకల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
![Mango Mango](https://tufan9.com/wp-content/uploads/2022/04/Amazing-health-benifits-of-mango-nuts.jpg)
మామిడి టెంకలు, పీసులు ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడితో సమానంగా కొంచెం జీలకర్ర, మెంతి పొడి కలిపి ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంతో పాటు తీసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు మామిడి టెంకల పొడి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతే కాకుండా ఇది జీర్ణ సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది. మహిళలు రుతుక్రమం సమయంలో వచ్చే కడుపు నొప్పి, కాళ్ల నొప్పులు వంటి సమస్యలను నివారించడంలో మామిడి టెంకల పొడి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఆహారంలో అప్పుడే తీసుకోవడం వల్ల శరీరంో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు.