Hero Balakrishna : ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఇటీవలే భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయనకు తాజాగా మరో శస్త్ర చికిత్స జరిగిందంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఇలా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తరఫు ప్రతినిధులు తెలిపారు. బాలయ్య మోకాలికి నీ ప్యాడ్ ధరించి ఉన్న ఫఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఆయనకు సర్జరీ అయిందనే ఊహాగానాలు వచ్చాయి. దానీపై ఆయన తరఫు ప్రతినిధులు స్పందిస్తూ… కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లారని స్పష్టం చేశారు. ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేయొద్దని కోరారు.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న ఆయన త్వరలోనే ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయిక. నవీన్ యెర్నేని, వై, రవి శంకర్ నిర్మాతలు. అలాగే వరలక్ష్మీ శరత్ ుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా… కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.
Read Also : Jr NTR: ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడానికి ఆ దోషమే కారణమా… అందుకే దీక్ష తీసుకున్నారా?