Viral video : మైకల్ జాక్సన్ అంటే తెలియని వారుండరు. పాటతో ప్రపంచాన్ని ఊర్రూతలూగించాడు. పాటతో పాటు డ్యాన్స్ లతో మైమరిపించాడు. ప్రపంచవ్యాప్తంగా డై హార్డ్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. మైకల్ జాక్సన్ అనగానే అదో తెలియని రిథమ్ వచ్చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వీడియోలతో చాలా మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. చిన్న చిన్న వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయగానే వారి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికన్ పిల్లలు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
![Viral video Viral video](https://tufan9.com/wp-content/uploads/2022/05/african-kids-amazing-dance-video-went-viral-on-social-media-1.jpg)
మైకల్ జాక్సన్ ను మైమరిపించేలా ఆ కుర్రాళ్లు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలో కొంత మంది చిన్న పిల్లల చుట్టూ నిలబడి ఉన్నారు. అదే సమయంలో ఆఫ్రికన్ పిల్లవాడు అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇది చూస్తే.. ఈ బాలుడి ప్రతిభకు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మరో కుర్రాడు వచ్చే డ్యాన్స్ ఇరగదీస్తాడు. మైకల్ జాక్సన్ స్టెప్పులతో రెచ్చి పోతాడు. ఈ చిన్నారుల డ్యాన్స్ వీడియో చూస్తే మీరు కూడా జాబ్రా ఫ్యాన్స్ అవుతారు.
చిన్నారులు చేసిన డ్యాన్స్ వీడియో కేవలం కొన్ని సెకన్లే అయినా… నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు మిలియన్ల కొద్దీ జనాలు చూస్తున్నారు. దాదాపు 40 లక్షల లైకులు వచ్చాయి. మైకల్ జాక్సన్ ను గుర్తుచేశారని, అమేజింగ్ డ్యాన్స్ అంటూ ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Shikhar Dhawan : ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ పై చేయి చేసుకున్న తండ్రి..వీడియో వైరల్!