Radha Krishna -Shankuntala : సాధారణంగా చాలామంది ఎదుర్కొనే సమస్యలో జుట్టు సమస్య ఒకటి. ఇలా చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా జుట్టు రాలిపోవడం తో ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన ఎలాంటి ఫలితం లేకపోతే చివరికి ఆశలు వదులుకొని మన పనులలో నిమగ్నమవుతారు. కానీ ఒక కూతురు జుట్టు అధికంగా రాలిపోవడంతో అది చూసిన 80 సంవత్సరాల వృద్ధ దంపతులు చేసిన పని ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ దంపతులు ఏం చేశారనే విషయానికి వస్తే..
సూరత్‌కు చెందిన రాధాకృష్ణ, శకుంతలా చౌదరి దంపతులు. సుమారు 50 సంవత్సరాల పాటు తన కుటుంబాన్ని ముందుకు నడిపించి కుటుంబ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకొని విశ్రాంతి పొందుతున్నారు.ఈ క్రమంలోనే తన కూతురు అధికంగా జుట్టు రాలే సమస్యతో బాధ పడటంతో తన బాధను తల్లిదండ్రుల దగ్గర చెప్పుకుంది.ఈ క్రమంలోనే తన కూతురు జుట్టు ఊడిపోవడానికి గల కారణం ఏంటి అని ఆ వృద్ధ దంపతులు ఏడాదిపాటు ఇంటర్నెట్లో పరిశోధించి అసలు విషయం కనుగొన్నారు.
ఇలా మగవారిలో అధికంగా జుట్టు రాలిపోవడానికి డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజన్, స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోను స్థాయిలలో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల ఇలా జుట్టు రాలిపోతోందని గుర్తించారు. ఇక ఈ హార్మోన్లు సరైన స్థాయిలో విడుదల కావాలంటే ఏం చేయాలని పరిశోధనలు చేసి 50 రకాల వనమూలికలతో పాటు కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆలివ్, వంటి నూనెలను ఉపయోగించే సరికొత్త ఆయిల్ సిద్ధం చేశారు.ఈ క్రమంలోనే ఆ ఆయిల్ ను తన కూతురికి ఇవ్వగా ఆ నూనె వాడిన తర్వాత తన జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా ఎంతో ఒత్తుగా పెరిగింది.
ఈ క్రమంలోనే ఈ ఆయిల్ తమ బంధువులకు కూడా ఇవ్వడంతో ఎంతో మంచి ఫలితాలను అందించాయి. ఈ క్రమంలోనే ఈ వృద్ధ దంపతులు అవిమీ హెర్బల్ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. అవిమీ ద్వారా ఎంతో శుద్ధమైన నూనెను అందించడమే కాకుండా ఆర్థో ఆయిల్, స్ప్రేలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.భవిష్యత్తులో మరి కొన్ని ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఈ వృద్ధ దంపతులు తెలియజేశారు. ఇలా వయసు పైబడిన వీరు చేసిన ఈ ప్రయత్నం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని చెప్పాలి.
Read Also : Viral video : ఈ పిల్లల స్టెప్స్ చూస్తే ఆశ్చర్యపోతారు.. మైకల్ జాక్సన్ ను మించిపోయారుగా
Tufan9 Telugu News And Updates Breaking News All over World