Devatha june 20 today episode : బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాలలో విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్ లలో దేవత ఒకటి.కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సీరియల్ ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరగనుందనే విషయానికి వస్తే.. దేవి బొమ్మలు గీస్తూ కూర్చోగా అది చూసిన మాధవ్ ఎలాగైనా దేవికి దగ్గర అయి రాదను ఇంటి నుంచి వెళ్లకుండా పర్మనెంటుగా తనవద్దే ఉంచుకోవాలని ఆలోచిస్తాడు. మరోవైపు ఆదిత్య దేవి గురించి ఆలోచిస్తూ ఎలాగైనా దేవికి దగ్గర కావాలని అనుకుంటాడు.
దేవికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తుండగా మాధవ్ మధ్యలో అడ్డు పడుతున్నాడు. ఆ సమయంలో సత్య వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ ఆదిత్య అని అడగగా దేవి గురించి అని చెప్పగా ఒక్కసారిగా సత్య షాక్ అవుతుంది.వెంటనే గ్రహించిన ఆదిత్య దేవుడమ్మ గురించి ఆలోచిస్తున్నాను. అమ్మ ఉపవాసం ఉండి తన ఆరోగ్యం పాడు చేసుకుంటుంది అంటూ టాపిక్ మారుస్తాడు. ఇక సత్య ఆదిత్య తన వద్ద ఏదో దాస్తున్నారు అంటూ ఆలోచనలో పడుతుంది.మరుసటి రోజు ఉదయం పిల్లలు స్కూల్ కి వెళ్లడానికి పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ తన అవ్వాతాతలతో ముచ్చట్లు పెట్టుకుంటూ సిద్ధమవుతారు.
అదే సమయంలో రాధా ఇక స్కూల్ కి పదండి అంటూ పిల్లలను సిద్ధం చేయగా దేవి వచ్చి మాధవ్ కి పంచ్ ఇస్తుంది. అదేవిధంగా రాధకు ముద్దు పెడుతుంది. ఎప్పుడూ లేనిది ఏంటి కొత్తగా అని అడగగా ఆఫీసర్ నేర్పించారని చెప్పడంతో మాధవ్ షాక్ అవుతాడు. అదే సమయంలో రాధ తన బిడ్డను దగ్గర చేసుకోవడం పెనిమిటి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సంబరపడుతుంది. స్కూల్ దగ్గర ఆదిత్య పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండగా అదే సమయంలో భాగ్యమ్మ పండ్ల బుట్ట ఎత్తుకొని స్కూల్ దగ్గరకు వస్తుంది. అక్కడ ఆదిత్య చూసి కంగారుగా పక్కకు వెళ్లి దాక్కుంటుంది. అదే సమయంలో పిల్లలు రావడంతో చిన్మయి ఆదిత్యను పలకరించి లోపలికి వెళుతుంది.
ఆదిత్య దేవి ఇద్దరు మాట్లాడుతూ ఉండగా తండ్రీ కూతుర్ల మధ్య మాటలు చూసి భాగ్యమ్మ ఎంతో సంబరపడుతోంది. ఇలా ఆదిత్య దేవి మాట్లాడుతూ వుండగా కార్ రివర్స్ చేసే సమయంలో దేవిని ప్రమాదం నుంచి ఆదిత్య కాపాడుతాడు.అదే సమయంలో కార్ డ్రైవర్ ని చూసుకోవాలని తెలియదా అంటూ తిట్టడమే కాకుండా నా కూతురికి ఏమైనా జరిగితే నేను ఉండలేను అంటూ నోరు జారాడు.ఈ విషయం గురించి దేవి ఆదిత్యను ఆరాతీయగా ఆదిత్య గతంలో నిన్ను దత్తత తీసుకోవాలి అనుకున్నాను అప్పటినుంచి నేను నా కూతురని భావిస్తున్నాను అంటూ కవర్ చేస్తాడు.ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి కాగానే వచ్చే ఎపిసోడ్ లో మాధవ్ ఒక లెటర్ రాసి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.
Read Also : Devatha june 16 today episode: దేవిని ఆదిత్యకు దూరం చేయాలి అనుకుంటున్న మాధవ.. బాధలో ఆదిత్య..?