...

Kajal Aggarwal : ఫొటోలతో షాక్ ఇచ్చిన కాజల్.. గర్భవతి అయింది అంటున్న నెటిజన్లు..

Kajal Aggarwal : సోషల్ మీడియా యుగంలో జనాలకు పెద్దగా పనిలేకుండా పోయింది. తమను కొందరు తెగ ఇబ్బంది పెడుతున్నారని సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితంలో ఏది జరిగినా మా కంటే ముందే మీరు మాట్లాడుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఏదైనా విశేషం ఉంటే మేమే చెబుతాం కదా.. ఆ మాత్రం దానికి పోస్టులు, కామెంట్స్ రూపంలో ఎందుకు విషప్రచారం చేస్తున్నారని కొందరు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలిసింది. తాజాగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ విషయంపై సోషల్ మీడియాలో జనాలు తెగ గుసగుసలాడుకుంటున్నారు. కాజల్ మాత్రం వీళ్లింతే.. ఇక మారరు అంటూ లైట్ తీసుకుని తన పని తాను చేసుకుంటూ పోతుందని టాక్.

కాజల్ అగర్వాల్ తన కెరీర్ మంచి రైజింగ్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో ఎవరికీ తెలియకుండా బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లును ప్రేమించి 2021 ఆక్టోబర్ 30న పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె తన భర్తతో హ్యపీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఖాళీ టైంలో తన భర్తతో టూర్లు ప్లాన్ చేస్తోంది. అయితే, కాజల్ తల్లి కాబోతుందని అందుకే సినిమాలకు ప్రస్తుతం దూరంగా ఉంటుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కాజల్ గతంలోనే స్పందించింది. అలాంటిది ఏమీ లేదని స్పెషల్ ఉంటే నేను చెబుతానని తెలిపింది.

తాజాగా కాజల్ తన సోషల్ మీడియా ఖాతాలో పిక్స్ షేర్ చేసింది. వాటిని చూసిన జనాలు మరోసారి ప్రెగ్నెన్సీ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చారు. జూమ్ చేసి మరీ కాజల్ గర్భం దాల్చిందా? లేదా అని పరిశీలిస్తున్నారట.. దీనిపై కొందరు వింతగా స్పందిస్తున్నారు. కాజల్ కు లేని తొందర మీకెందుకు.. ప్రతీది క్షుణ్ణంగా చూడాలా? అంటూ నెటిజన్లకు కౌంటర్ ఇస్తున్నారు.అయితే, నెటిజన్లకు వచ్చిన అనుమానంపై మరోసారి కాజల్ స్పందిస్తుందా? లేదా వేచిచూడాలి.

Read Also : Actress Ragini : నన్ను పడుకుని అయినా డబ్బులు తేవాలని టార్చర్ చేశాడు..!