...

Kajal Agarwal : అరుదైన గౌరవం దక్కించుకున్న ‘కాజల్ అగర్వాల్’… ఏంటంటే ?

Kajal Agarwal : తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ… కాజల్ అగర్వాల్. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మి కళ్యాణం సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ‘చందమామ’ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది కాజల్. ఇక అనంతరం వరుస విజయాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. సినిమాల్లో బిజీగా ఉన్న తరుణంలో తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ను 2020 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకుంది కాజల్. ప్రస్తుతం ఆమె గర్భవతి అయిన కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

కాగా ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ కు అరుదైన గౌరవం లభించింది. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను అందుకుందీ చందమామ. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న కాజల్‌… తనకు అరుదైన గౌరవం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ‘యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మనలాంటి కళాకారులకు ఈ అరబ్‌ దేశం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తోంది. నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు యూఏఈ మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు. భవిష్యత్‌ లో కూడా మీ సహాయ సహకారాలు కొనసాగాలని కోరుకుంటున్నాను’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది.

తదితర రంగాల్లో సేవలందిస్తున్న వారికి దుబాయ్ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ వీసాను అందిస్తోంది. ఈ వీసాతో ఆ దేశంలో ఎంతకాలమైనా ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం ఉండే వీలుంటుంది. ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా షారుఖ్‌ ఖాన్‌ అందుకున్నాడు. ఆ తర్వాత సంజయ్ దత్, సునీల్‌ శెట్టి, సోనూ నిగమ్‌, నేహా కక్కర్‌, మౌనీ రాయ్‌, ఫరా ఖాన్‌, బోనీ కపూర్‌ కుటుంబం ఈ వీసా పొందింది. కాగా దక్షిణాదిలో మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, టోవినో థామస్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, అమలాపాల్‌ ఈ వీసాను అందుకున్నారు. ఇటీవల మెగా కోడలు ఉపాసన కూడా ఈ గౌరవం దక్కించుకుంది.

Read Also : 50 Days Pushpa Collections : 50 డేస్ కంప్లీట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప’… ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎంతంటే?