Actress Hema:తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి హేమ ఒకరు.ఈమె ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తన మాటల ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని మా అసోసియేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మా అసోసియేషన్ కు మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తే 20 లక్షలు ఖర్చు చేస్తారు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
మా అసోసియేషన్ గొడవ వల్ల చాలా నష్టం కలుగుతుందని మా అసోసియేషన్ కు ఎంతో సేవ చేద్దామని భావిస్తున్నప్పటికీ కొందరు ఈగోల వల్ల భ్రష్టు పట్టిస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.ఇకపోతే మా అసోసియేషన్ లో నిధుల సేకరణ కోసం హీరో ప్రభాస్ గారిని కలవడానికి వెళ్లామని ఈమె తెలిపారు. మా అసోసియేషన్ కోసం అమెరికాలో ఈవెంట్ కు రమ్మని ప్రభాస్ గారిని అడిగితే ఆయన మా అసోసియేషన్ కు కోటి రూపాయలు విరాళం ఇస్తానని చెప్పారు. అయితే మీరు ఈ ఈవెంట్ కి వస్తే రెండు కోట్లు వస్తాయని చెప్పాము.
ఈ విధంగా ప్రభాస్ గారికి చెప్పే సరికి ఆయన అమెరికాలో జరిగే ఈవెంట్ కి వస్తానని చెప్పారు. ప్రభాస్ తో పాటు మహేష్ బాబు కూడా ఈ ఈవెంట్ కి వస్తానని చెప్పారు. ఈ కార్యక్రమం జరిగే ఉంటే మా అసోసియేషన్ కష్టాలే ఉండేవి కాదని అయితే మా అసోసియేషన్ కార్యదర్శి లేనిపోని గొడవలు సృష్టించి ఈ కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారని ఈ సందర్భంగా మా అసోసియేషన్ గురించి మా కష్టాల గురించి ఈ సందర్భంగా హేమ ఆవేదన వ్యక్తం చేశారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World