Rajasekhar: నా బతుకు జట్కాబండి.. హీరో రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్!

Rajasekhar: బుల్లితెరపై ఏదైనా పండుగలు లేదా ప్రత్యేక రోజులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడం సర్వ సాధారణం. ఈ క్రమంలోనే ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ టీవీ అంగరంగ వైభవంగా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జీవిత రోజా మధ్య తీవ్రస్థాయిలో గొడవ చోటుచేసుకుంది. ఇది వరకు విడుదల చేసిన ప్రోమోలో భాగంగా రోజా హైపర్ ఆది బుల్లెట్ భాస్కర్ చెంప చెళ్లుమనిపించిన విషయం మనకు తెలిసిందే. ఇదే విషయమై జీవిత సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.

గతంలో బుల్లితెరపై జీవిత బతుకు జట్కా బండి రోజా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తూ తమకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అదే తరహాలో అంగరంగ వైభవంగా కార్యక్రమంలో కూడా పంచాయతీ పెట్టారు. ఇక జడ్జీ స్థానంలో జీవిత కూర్చోగా రోజా ఆ సీటు కోసం జీవితతో గొడవ పడుతుంది. ఆ సీటు నాది అంటే నాది అంటూ ఇద్దరు పోటీ పడతారు. ఇక జీవిత సమక్షంలో రోజా హైపర్ ఆది, బులెట్ భాస్కర్ ను ఎందుకుకు కొట్టిందో అడుగుతున్న నేపథ్యంలో మరోసారి రోజా వారి పై చేయి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ఇలా ఈ విషయం గురించి జీవిత రోజా మధ్య గొడవ మొదలవగా హైపర్ ఆది మాట్లాడుతూ మీరైనా చెప్పండి సార్ వీళ్ళకి అంటూ రాజశేఖర్ ని అడుగుతారు. వెంటనే రాజశేఖర్ తాను నటించిన శేఖర్ సినిమా చూడండి అంటూ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటారు.చివరికి రోజా నన్ను ఏమైనా అంటే నేను బాధపడను కానీ నా ప్రజలను అన్నారు అందుకే కొట్టాను అంటూ చెబుతుంది. ప్రజలని అంటారా అంటూ జీవిత హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ ని కొట్టడానికి వెళ్లగా హైపర్ ఆది మీరైనా చెప్పండి ఆవిడకి అంటారు. వెంటనే రాజశేఖర్ నా బతుకే ఒక జట్కాబండి అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel