Police notification : ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న… పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మొత్తం 17 వేల 99 పోస్టులు ఖాళీగా ఉండగా… అందులో 587 ఎస్సై పోస్టులు.. 16, 027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 414 సివిల్ ఎస్ఐలు, 66ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అలాగే ఉద్యోగాల భర్తీ విధానంపై సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రకటించింది. గ్రూప్-1 లో 19 రకాల పోస్టులు… 900 మార్కులతో రాత పరీక్ష నిర్వహించబోతున్నట్లు తెలిపింది. అలాగే గ్రూప్-2 లో 16 రకాల పోస్టులు… 600 మార్కులకు రాత పరీక్ష, గ్రూప్-3 లో 8 రకాల పోస్టులు, 450 మార్కులతో రాత పరీక్ష గ్రూప్- 4 లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, గ్రూప్- 4లో 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా గ్రూప్-1 మెయిన్స్‌కు మల్టీజోన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు. అలాగే ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున గ్రూప్- 1 మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు.
Read Also : Police notification: పోలీసు పరీక్షా విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!