Business idea : కేవలం రూ. 70 వేలతో అదిరిపోయే బిజినెస్.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన..!

solar business idea do you want to start business with low investment start solar power
solar business idea do you want to start business with low investment start solar power

Business idea : వ్యాపారం చేయాలంటే లక్షల కొద్దీ రూపాయలు అక్కర్లేదు. తక్కువ పెట్టుబడితో కూడ మంచి బిజినెస్ ప్రారంభించొచ్చు. దాని నుండి లాభాలూ సంపాదించొచ్చు. అలాంటిదే ఈ బిజినెస్ ఐడియా కూడా. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ వ్యాపారం చేయడానికి కేవలం రూ. 70 వేలు ఉంటే చాలు. పెట్టుబడి పెట్టి మంచి లాభాలు సంపాదించొచ్చు.

రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ బిజినెస్ లో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సంపాదించొచ్చు. ఈ బిజినెస్ ను ప్రారంభించడానికి ఇంటి పై ఖాళీ స్థలం మాత్రం ఉండాలి. ఆ స్థలంలో సోలార్ ప్యానెల్స్ అమర్చాలి. ఆ సోలార్ ప్యానెల్స్ నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసి గ్రిడ్ కు సరఫరా చేయవచ్చు.

Advertisement
solar business idea do you want to start business with low investment start solar power
solar business idea do you want to start business with low investment start solar power

రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ 30 శాతం సబ్సిడీ కూడా ఇస్తోంది. సబ్సిడీ లేకుండా రూఫ్ టాప్ సోలార్ ప్యానెస్ల్ ఏర్పాటు చేస్తే రూ. లక్ష ఖర్చు అవుతుంది. ఈ పెట్టుబడిపై 30 శాతం సబ్సిడీ పొందవచ్చు. అంటే రూ. 30 వేలు రాయితీ రూపంలో లభిస్తుంది.

Read Also : Business idea: తక్కువ పెట్టుబడితో నూనె మిల్లు ఏర్పాటు.. ఒక్కసారి పెట్టుబడి, సుదీర్ఘకాలం రాబడి

Advertisement