...
Telugu NewsHealth NewsBeauty Tips: 5 నిమిషాల్లో మీ మొహం తెల్లగా కాంతివంతంగా కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కా...

Beauty Tips: 5 నిమిషాల్లో మీ మొహం తెల్లగా కాంతివంతంగా కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి?

Beauty Tips:ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అందంగా కనిపించడం కోసం వేలకు వేలు ఖర్చు చేసి బ్యూటీపార్లర్ కు వెళుతూ తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఇలా ఎక్కువ సంఖ్యలో డబ్బులు ఖర్చు చేసి అందాన్ని కూడా కొనుకుంటున్నారు.పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసినప్పటికీ తాత్కాలికంగా మాత్రమే అందంగా కనిపించిన తదుపరి మన చర్మం యధావిధిగా మారిపోతుంది.ఇలా కాకుండా నిత్యం మన చర్మం ఎంతో కాంతివంతంగా యవ్వనంగా కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు. మరి ఆ చిట్కా ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

సహజసిద్ధంగా మన ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఓట్స్ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే ఒక గిన్నెలోకి ఓట్స్ తీసుకొని మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. ఇక మరొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ చందనం, మరొక టేబుల్ స్పూన్ కాఫీ పొడి, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలియబెట్టుకోవాలి.

Advertisement

ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల అనంతరం మొహాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖం పై ఉన్న మచ్చలు తొలగి పోవడమేకాకుండా, ముఖం ఎంతో కాంతివంతంగా అవుతుంది. అలాగే నల్లగా ఉన్న వారు కూడా తెల్లగా మారుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిట్కా పాటించి మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.

Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు