...

Blood Group vs Heart Risk : ఈ బ్లడ్ గ్రూప్స్ వారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ జాగ్రత్త..!

Blood Group vs Heart Risk : ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుండి గుండె సంబంధిత సమస్యలు వేధిస్తు ఈ హార్ట్ ఎటాక్ కారణంగా చాలామంది మరణిస్తున్నారు. దీనికి ఆహారపు అలవాట్లలో మార్పులు ఒక కారణం అయితే బ్లడ్ గ్రూప్ కూడ మరోక కారణం. కానీ బ్లడ్ గ్రూప్ కారణంగా హార్ట్ ఎటాక్ వస్తుందని చాలామందికి తెలీదు. ఏ బ్లడ్ గ్రూప్స్ వారికి ఎక్కువ హార్ట్ ఎటాక్ సమస్య వచ్చే ప్రమాదం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

హార్ట్ ఎటాక్ సంభవించటానికి గల కారణాల గురించి తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వారికి కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడయ్యింది. ముఖ్యంగా ఏ, బీ బ్లడ్ గ్రూపు ఉన్న వారికి థ్రోంబోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్రోంబోసిస్ అంటే శరీరంలోని రక్తనాళాలు కుదించుకు పోయి సరఫరా సరిగా జరగక గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా అనేక రకాల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

Advertisement

అయితే కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వారికి గుండే జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని సమాచారం . యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ గా పిలువబడే ఓ బ్లడ్ గ్రూప్ వారికి ఈ హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువగా ఉండకపోవచ్చు. అయితే ఏ బ్లడ్ గ్రూప్ వారైనా కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా మంచి పౌష్ఠిక ఆహారం తీసుకుంటూ.. ప్రతిరోజు సరిపడ సమయం నిద్రపోతూ, వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అంతే కాకుండ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాయలు మీ ఆహారం చేర్చుకోవాలి.

Advertisement
Advertisement