Vitamine D : సాధారణంగా మన శరీర అవసరానికి మించి మనం ఏది తీసుకున్న అది వికారమే అవుతుంది. అలా అవసరానికి మించి ఆహార పదార్థాలను తీసుకుంటా లేదా మన శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ తీసుకున్నా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మన శరీరానికి విటమిన్స్ ఎంతో ఉపయోగపడతాయి అందులోనూ విటమిన్ డి శరీరానికి ఎంతో కీలకం. అయితే అవసరానికి మించిన విటమిన్ డి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి అనే విషయానికి వస్తే..

చాలామంది విటమిన్లను సప్లిమెంట్ రూపంలో తీసుకుంటారు. ఈ క్రమంలోని విటమిన్ డి అధికంగా సప్లిమెంటరీ రూపంలో తీసుకోవటం వల్ల వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి అందుకే డాక్టర్ల సలహా సూచనల మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం ఎంతో మంచిది.
Vitamine D : విటమిన్ డి అధికంగా తీసుకుంటే అంతే సంగతలు..
పరిమితికి మించి విటమిన్ డి తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి.అదేవిధంగా విటమిన్ డి సప్లిమెంట్ అధికంగా తీసుకోవడం వల్ల ఆకలి మందగిస్తుంది అందుకే సప్లిమెంటరీ రూపంలో కాకుండా ప్రతిరోజు ఉదయం సూర్య రష్మి నుంచి వెలువడే విటమిన్ డి ని పొందడం ఎంతో మంచిది.
విటమిన్ డి సప్లిమెంట్స్ అధికంగా తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారంపై ప్రభావం చూపుతుంది తద్వారా జీర్ణక్రియ సమస్యలతో పాటు మలబద్ధక సమస్య కూడా తలెత్తుతుంది.
Read Also : Health Tips: ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాలలో ఈ పొడి కలుపుకుని తాగితే చాలు… ఆ సమస్యలన్నీ మాయం!