Health Tips for Gas Problems : ప్రస్తుతం చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో వారికి తిన్న తర్వాత ఛాతిలో మంట పుట్టడం మొదలవుతుంది. దీనికి కారణం మన కడుపులో ఆమ్లం అధికంగా ఉండటం. అయితే ఈ సమస్య రావడానికి కారణాలు అనేకం. వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, ఫాస్ట్ ఫాస్ట్ గా ఫుడ్ ను తీసుకోవడం, ఎరేటెడ్ పానియాలను తాగడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది.
అంతేకాదు తొందరగా అరగని ఫైబర్, స్టార్చ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అయితే గ్యాస్ట్రిక్ సమస్యతో వచ్చే ఛాతిలో నొప్పిని కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
లవంగాలు : మలబద్దకం, అజీర్తి, వాపు, గ్యాస్ట్రిక్ సమస్యలకు ఇది దివ్య ఔషదంలా పనిచేస్తుంది. తిన్న తర్వాత లవంగాలను నమిలితే గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశమే ఉండదు. అంతేకాదు తిన్న వెంటనే ఒక టీ స్పూన్ లవంగాల పొడిని తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. అలాగే ఇది మన బాడీలో ఉండే అదనపు గ్యాస్ ను కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పెరుగు : పెరుగులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఛాతిలో మంటగా అనిపించినప్పుడు కాస్త పెరుగును తీసుకుని దానిలో కొన్ని వాటర్ కలుపుకుని తాగితే ఆ నొప్పి నుంచి ఈజీగా బయటపడతారు.

ఫైబర్ : జీర్ణ వ్యవస్థకు అధిక ఫైబర్లు లభించే ఆహారం మేలు చేస్తుంది. ఈ ఫైబర్లు చిక్కుళ్లు, ఆకు పచ్చ కూరగాయలు, గింజలు, బెర్రీల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణ క్రియకూడా మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఇవి గ్యాస్ట్రిక్ నొప్పిని కూడా తగ్గిస్తాయి.
కూరగాయలు : కొన్ని రకాల కూరగాయలు గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించడంలో ముందుంటాయి. బంగాళదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు నొప్పి సమస్య నుంచి మనల్ని బయటపడేలా చేస్తాయి. అలాగే గుమ్మడికాయ రసం కూడా గ్యాస్ట్రిక్ ఆమ్లతను తగ్గించే ఔషద గుణాన్ని కలిగి ఉంటుంది.
Read Also : Karthika Deepam Feb 10 Episode : సూపర్ క్లైమాక్స్.. సౌందర్య ఎంట్రీతో రుద్రాణికి చెక్..! మండిపోతున్న మోనిత..!