Egg myths: గుడ్లపై కోడి రెట్ట, ఈకలు ఉన్నాయా.. వాటిని తింటే ఏమవుతుందో తెలుసుకోండి

Egg myths: కోడి గుడ్లు మధ్యతరగతి వారి నాన్ వెజ్ ఐటెం ఇది. అలాగే జిమ్ లకు వెళ్లే వాళ్లు ఎక్కువగా తినే పదార్థం. గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆహారంలో కోడి గుడ్డును భాగం చేసుకోవాలని చెబుతారు వైద్యులు. ఓ సర్వే ప్రకారం భారత దేశంలోని ప్రజలు సంవత్సరానికి యావరేజ్ గా 61 కోడి గుడ్లు తింటారు. గుడ్లు సమతుల్య ఆహారం, పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఈ, విటమిన్ డీ, బీ12, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో పాటు అనేక పోషకాలు గుడ్డులో ఉంటాయి.

మనం గుడ్లు కొనే సమయంలో గుడ్లపై ఎండిన కోడి రెట్టలను గమనించే ఉంటాం. అలాగే ఈకలు కూడా కనిపిస్తాయి. ఆరోగ్య నిబంధనల ప్రకారం పౌల్ట్రీ ఫాంల నుండి కోడి గుడ్లను తెచ్చే సమయంలో పూర్తిగా శానిటైజ్ చేయాలి. కానీ చాలా మంది ఇలాంటి నిబంధనలేనీ పాటించరు. అలాగే గుడ్డు పెంకులో సాల్మొనెల్లా లాంటి క్రిములు ఉండే అవకాశం ఉంటుంది.

Advertisement

ఇది తీసుకున్నప్పుడు వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. గుడ్డు పెంకు రంధ్రాలతో ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించవచ్చు. మనం సాధారణంగా గుడ్డు ట్రేలను కొనుగోలు చేసేటప్పుడు చాలా వరకు వాటిని కొన్ని వారాల పాటు ఫ్రిజ్ లో ఉంచుతారు. గుడ్డుపై ఎండి రెట్ట ఉంటే అలాంటి కోడి గుడ్లను తీసుకోకపోవడమే మంచిది ఎందుకంటే.. రెట్టలో క్రిములు, బ్యాక్టీరియా గుడ్డు లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది.

Advertisement