...

Bigboss siri: బిగ్ బాస్ సిరిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీహాన్.. ఏమన్నాడంటే..?

Bigboss siri: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సిరిపై ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తను అస్సలే దేకదని అన్నాడు. ఇంకా ఏమేం అన్నాడంటే…
బిగ్ బాస్ సీజన్ 5 అనేక సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. షణ్ముఖ్ జస్వంత్, అలాగే సిరి హనుమంతు మధ్య జరిగిన అఫైర్ పై చాలా మంది నెగెటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే.. షణ్ముఖ్ జస్వంత్ కు బయట దీప్తి సునైనా అనే లవర్ ఉంది. అలాగే సిరి హనుమంతుకు కూడా శ్రీహాన్ అనే లవర్ ఉన్నాడు. అయితే షణ్ముఖ్, సిరి బిగ్ బాస్ లోకి వెళ్లాక మొదట్లో ఫ్రెండ్స్ గానే ఉండేవారు. తర్వాత వారి అసలు రంగు చూపించారు.

వేర్వేరు లవర్స్ ఉన్న వీరిద్దరూ బిగ్ బాస్ హౌజ్ లోపలికి వెళ్లగానే క్లోజ్ అయ్యారు. దీనిని ఆడియన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేదు. బయటకు వచ్చాక షణ్ముఖ్ జస్వంత్ కు తన ప్రియురాలు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పింది. అలాగే సిరికి కూడా శ్రీహాన్ బ్రేకప్ చెప్తాడని అంతా అనుకున్నారు. ఈ విషయంపై పెద్దగా చర్చ జరగకపోయినా ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

షణ్ముఖ్ జస్వంత్- దీప్తి సునైనా జంట లాగే… సిరి హనుమంతు- శ్రీహాన్ విడిపోతారన్న పుకార్లు వచ్చాయి. అయితేఅదేమీ జరగట్లేదని తాజాగా వెల్లడైంది. యాంకర్ రవి తన పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. అందులో నవ్వులే నవ్వులు పేరిట ఒక ప్రొగ్రాం ప్లాన్ చేశాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్సు ప్రియా, ప్రియాంక, సిరి హనుమంతు ముగ్గురిని ఒక రెస్టారెంట్ కు తీసుకెళ్లి సరదాగా గడిపారు.

అదే సమయంలో శ్రీహాన్ చేసిన ఓ వీడియోను రవి తన ఛానల్ ప్రోమోలో చూపించాడు. ఆ వీడియోలో సిరిని అర్థం చేసుకోవడానికి చాలా సమయంల పడుతుందని.. సిరి చాలా పట్టుదల గల అమ్మాయి అని శ్రీహాన్ అన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అసలు దేకదు అంటూ ఆసక్తికర కామెంట్లు చేశాడు.