Drinking Water : మనం తిండి తినకపోయిన ఒక రోజు ఉండగలం కానీ నీరు తాగకుండా ఉండలేము. చలి కాలంలో చాలా మందికి దాహం చాలా తక్కువగా వేస్తుంది. ఒక మనిషి రోజుకు సగటున నాలుగు లీటర్ నీటిని తాగాలి. వింటర్‌లో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల బాడీ సైతం పొడిగా ఉంటుంది. చాలా మంది ఆహారం తిన్న తర్వాత నీటిని తాగరు. దీంతో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీని వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. మలబద్దకం సమస్య వేధించినప్పుడు నీటిని ఎక్కువగా తాగాలి. దీని వల్ల ఆహారం తొందరగా జీర్ణం అయి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
రాత్రి సమయంలో మీకు ఆకలి వేయకుండా గొంతు వద్ద ఎదో అడ్డుపడుతున్నట్టు అనిపిస్తే మీకు ఎసిటీడీ సమస్య వచ్చిందని సంకేతం. దీనిని నివారించేందుకు నీటిని ఎక్కువగా తాగాలి. శీతాకాలంలో చాలా మంది తరచుగా తలనొప్పితో బాధపడుతుంటారు. దీని వల్ల శరీరం చాలా అలసిపోతుంది. కానీ ఇది బాడీ డీహైడ్రేషన్ కావడం వల్ల వస్తుంది.
బాడీలో వాటర్ లెవల్ తగ్గినప్పుడు మూత్ర విసర్జన సమస్య ఇబ్బంది పెడుతుంది. ఆ టైంలో కాస్త చికాకు, వెన్నునొప్పి, అసౌకర్యంగా అనిపిస్తుంది. మూత్రనాళం సైతం డ్రైగా మారడంతో దురద వస్తుంది. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు విటమిన్ సీ ఎక్కువగా ఉన్న వాటిని తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. వింటర్‌లో స్కిన్ పొడిబారుతుంది.
దీని వల్ల చర్మంపై దురద, దద్దుర్లు, జట్టురాలడం, పెదవులు పడలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మార్నింగ్ లేవగానే చాలా మంది వద్ద నోటి దుర్వాసన వస్తుంది. ఇందుకు కారణం నోటిలో పేరుకుపోయిన బ్యాక్టిరియానే. నీరు తక్కువగా తాగడం వల్ల లాలా జలం తక్కువగా ఉత్పత్తి అయి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.
Read Also : Health Tips : ఈ చలి కాలంలో నోటి పూతతో బాధ పడుతున్నారా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !