Back headache: తల నొప్పి చాలా మంది బాధ పెట్టే సమస్య. కొందరు తరచూ తలనొప్పితో బాధ పడుతుంటారు. ఒక్క రోజు సరిగ్గా నిద్ర లేకపోయినా తల నొప్పి బాధిస్తుంది. కొద్దిగా పని ఎక్కువ అయినా తల పోటు బాధ పెడుతుంది. అయితే తల నొప్పిలో చాలా రకాలు ఉంటాయి. తలపై నొప్పి ఏ ప్రాంతంలో పెడుతుంది అనే అంశంపై ఆ నొప్పి ఎందుకు వస్తుందో తెలుస్తుంది. కొందరిలో తల ముందు భాగంలో నొప్పిగా ఉంటుంది. తల పైభాగంలో, చెవుల వెనక, కేవలం ఎడమ వైపు, లేదా కుడి వైపు తల నొప్పిగా ఉంటుంది. మరికొందరిలో తల వెనక భాగంలో నొప్పి తరచూ వస్తుంది.
అయితే తల వెనక నొప్పిని తరచూ బాధ పెడుతుంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు వైద్యులు. తీవ్ర ఒత్తిడికి గురి అయిన సమయంలో తల వెనక భాగంలో తీవ్రమైన తల నొప్పి ఉంటుంది. అలా తీవ్రమైన తలనొప్పి అనేక సమస్యలకు దారి తీస్తాయని అంటున్నారు వైద్యులు. వెన్నెముకలో అన్నింటికన్నా పైన ఉండే వెన్ను పూస ఉన్న ప్రాంతంలో కొద్దిగా పక్కకు జరిగితే నొప్పి రావొచ్చు. అయితో ఇలా వెన్ను పూస పక్కకు జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. దెబ్బలు తగలడం, రుమ టాయిడ్ ఆర్థ్రయిటిస్ వంటి కారణాల వల్ల ఇది సంభవిస్తుంది. ఇలా పలు కారణాల వల్ల తలనొప్పి రావొచ్చు కాబట్టి వెంటనే న్యూరాలజిస్టును కలవాలని సూచిస్తున్నారు నిపుణులు.