September 21, 2024

Health Tips: హై బీపీ ఉన్న వారు రోజు పెరుగు తింటున్నారా? షాకింగ్ విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు…!

1 min read
pjimage 4

Health Tips: మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా అనేక మంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. ఒకప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబిసిటీ వంటి రోగాలు చాలా అరుదుగా వచ్చేవి. ఈ రోజుల్లో చాలా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. 2020 సంవత్సరంలో మాత్రమే 15 శాతం మంది అధిక రక్తపోటు బారిన పడ్డారు అంటే దీని తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గడచిన నాలుగు సంవత్సరాల నుండి అధిక రక్తపోటు బారిన పడి వారి సంఖ్య విపరీతంగా పెరిగిందట. 35 శాతం మంది కుటుంబాలు ఈ వ్యాది బారిన పడి ఇబ్బందులు పడుతున్నాయి.అయితే హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారు ఆహారం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.

pjimage 4ప్రపంచం మొత్తంలో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది అధిక రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. దీని కారణంగా వాళ్లు గుండె పాటు, స్ట్రోక్, గుండె సంబంధిత వ్యాధులు బారిన పడుతున్నారు. అమెరికాలో ప్రతి 36 సెకండ్లకు ఒకరు CVD బారిన పడి మరణిస్తున్నారు అంటే దీని తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. CVD ని తెలుగులో రక్తనాళ సంబంధిత వ్యాధి అని అంటారు. అధిక రక్తపోటు కారణంగా రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ మైనే, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా హై బీపీ గురించి ఒక పరిశోధన జరిపారు. ఈ పరిశోధనలో గుండె సంబంధిత కారకాలు, రక్తపోటు కారకాల మీద పెరుగు ప్రభావం చూపుతుంది అని తేలింది. పెరుగు, పాల ఉత్పత్తులలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. పాల పదార్థాలు, పెరుగు లో రక్తపోటును తగ్గించే మంచి బాక్టీరియా శరీరానికి లభిస్తుంది అని అధ్యయనం తెలిపింది. సాధారణంగా పెరుగు తినే వారిలో, తినని వారికంటే 7 పాయింట్లు బీపీ తక్కువగా ఉంటుంది అని అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటు తో బాధపడేవారు పెరుగు, పాల పదార్థాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది శాస్త్రవేత్తలు వెల్లడించారు