Corona Virus : గత రెండు సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యధిక కాలం చేసిన కరోనా వైరస్ కొంతకాలంగా దేశంలో తగ్గుముఖం పట్టింది. కరోనా తగ్గుముఖం పట్టిందని ప్రజలు ఊపిరి తీసుకునే సమయానికి ఒమిక్రాన్ మరొక వేరియంట్ ‘ ఎక్స్ఈ ‘ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ఒమిక్రాన్ వెరీ ఏంటి కన్నా అతి వేగంగా ప్రజలలో వ్యాప్తి చెందుతుందని అందువల్ల ప్రజలు sarora నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
“ఎక్స్ఈ” వేరియంట్‌తో ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఒమిక్రాన్ సబ్ వేరియంట్. “బీఏ.1, బీఏ.2″ల మిశ్రమ వేరియంట్‌గా “ఎక్స్ఈ” వ్యాప్తి చెందుతుంది. ఇది బీఏ.2 కంటే 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మాస్కుల వినియోగంపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు.
భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కరోనా వైరస్ ఉద్భవించిన చైనాలో మాత్రం రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందువల్ల కరోనా నిబంధనలు పాటించకపోతే భారతదేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతున్న
“ఎక్స్ఈ” వల్ల చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Read Also : Crime News: విజయవాడలో దారుణం… మద్యం మత్తులో కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు..!