Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

తినేటప్పుడు నీరు తాగితే ఏమవుతుంది? ఏ టైంలో తాగితే బెటర్..

భోజనం సమయంలో చాలా మందికి వచ్చే డౌట్.. నీరు ఎప్పుడు తాగాలి. భోజనం పూర్తయిన తర్వాతనే నీరు తాగాలని చాలా మంది చెబుతుంటారు. కానీ కొందరికి మధ్య మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. మరి ఇలా మధ్యమధ్యలో నీరు తాగితే ఏమవుతుంది. అసలు నీరు ఎప్పుడు తాగాలి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.. తినడానికి ముందు నీరు తాగితే ఆహారాన్ని మితంగా తీసుకునే ఛాన్స్ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. వీరికి తోడు వైద్యులు సైతం ... Read more

By Ramesh Babu

Published on: January 10, 2022 1:14 PM

Updated on: January 10, 2022 1:14 PM

---Advertisement---

భోజనం సమయంలో చాలా మందికి వచ్చే డౌట్.. నీరు ఎప్పుడు తాగాలి. భోజనం పూర్తయిన తర్వాతనే నీరు తాగాలని చాలా మంది చెబుతుంటారు. కానీ కొందరికి మధ్య మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. మరి ఇలా మధ్యమధ్యలో నీరు తాగితే ఏమవుతుంది. అసలు నీరు ఎప్పుడు తాగాలి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.. తినడానికి ముందు నీరు తాగితే ఆహారాన్ని మితంగా తీసుకునే ఛాన్స్ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. వీరికి తోడు వైద్యులు సైతం ఇదే చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు, ఆహారాన్ని మితంగా తీసుకోవాలని భావించే వారు భోజనానికి ముందు నీరు తాగాలని సూచిస్తున్నారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఆహారం తీసుకునే ముందు నీరు తాగితే బలహీనత, స్పృహ కోల్పోయే ప్రమాదముందని చెబుతోంది.

Advertisement

భోజనం చేసేటప్పుడు దాహం వేసినా, లేదా ఎక్కిళ్లు వచ్చినా కేవలం కొద్ది పరిమాణంలోనే నీరు తాగాలి. చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణాశయంపై ప్రభావం పడుతుంది. ఆయుర్వేదం భోజనం చేసే సమయంలో నీరు తక్కువగా తాగడం మంచిది. దీని వల్ల ఆహారం విచ్చిన్నంలో నీరు ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇక భోజనం ముగిశాక వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియపై ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల ఊబకాయం పెరిగే ఛాన్స్ ఉంది. భోజనం ముగిసిన తర్వాత 30 నిమిషాల పాటు విరామం తీసుకుని నీరు తాగడం మంచింది. భోజనం చేసే టైంలో సోడా, కాఫీ లాంటివి తాగొద్దు. ఆహారం జీర్ణం అయ్యేందుకు గోరువెచ్చని నీటిని మాత్రమే తాగడం మంచింది. ఈ టిప్స్ పాటించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. లేదంటే అజీర్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :