Chicken Skin Benefits : మీకు కోడికూర అంటే ఇష్టమా? స్కిన్‌తో చికెన్ తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. చాలామంది చికెన్ షాపు నుంచి చికెన్ ఆర్డర్ చేసి ఇంటికి తెచ్చి రుచికరంగా వండుకుని తింటుంటారు. వాస్తవానికి చాలామంది స్కిన్ లెస్ చికెన్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొంతమంది మాత్రం స్కిన్ తోనే చికెన్ కావాలని అడిగి మరి ఆర్డర్ చేస్తుంటారు. ఇంతకీ స్కిన్ లెస్ చికెన్ తింటే మంచిదా? లేదా స్కిన్ తో చికెన్ తింటే మంచిదా? అందులో ప్రత్యేకించి పెద్దగా తేడా ఏమి ఉంటుందిలే అనుకోవచ్చు. స్కిన్‌తో కోడిని వండుకుని అలానే తింటే అందులోని కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదని అంటుంటారు. వాస్తవానికి స్కిన్‌తో చికెన్ తింటనే చాలా మంచిదట..
ఒక యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. కోడి స్కిన్‌లో అన్ శాచురేటెడ్ అనే ఫ్యాట్స్ అధిక మొత్తంలో ఉంటాయట.. స్కిన్ చికెన్ తినడం ద్వారా బ్లడ్ ప్రెజర్ సమస్యను తగ్గిస్తాయని రుజువైంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట.. స్కిన్‌తో కోడిని తినేముందు కొన్ని విషయాలను గుర్తించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కోడి చర్మంపై ఎయిర్ తీసేసి.. బాగా కాల్చాలి. ఆ తర్వాత కాస్తా దానిపై పసుపు కూడా రాయాలి.. పసుపు యాంటీబయోటిక్.. కోడి చర్మంపై అనేక సూక్ష్మజీవులు ఉంటాయి. ఇలా చేయడం ద్వారా నశిస్తాయి.
అప్పుడు అది వండుకుని తినవచ్చు. చికెన్ తినమన్నారు కదా.. అని అదే పనిగా చికెన్ తినేయకూడదు.. అలా చేస్తే.. ఆరోగ్యానికి కంటే అనారోగ్య సమస్యలే అధికంగా వస్తాయని తప్పక గుర్తించుకోవాలిసిన విషయం.. మాంసాహారం తినేవారిలో చాలామంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. స్కిన్‌తో చికెన్ తింటే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట.. కొవ్వు ఎక్కువగా తయారువుతుందట..
అందుకే తరచుగా కాకుండా అప్పుడప్పుడూ చికెన్ తినొచ్చునని సూచిస్తున్నారు నిపుణులు.. కరోనా పరిస్థితుల్లో చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు చికెన్ వంటి మాంసాహారాన్ని ఎక్కువ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్కిన్ చికెన్ లేదా స్కిన్ లెస్ చికెన్ అయినా జాగ్రత్తగా శుభ్రంగా కడిగి.. వేడినీళ్లల్లో ఉడికించి తినడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
Read Also : Tamarind Seed Benefits : చింతగింజలతో ఇలా చేస్తే ఈ నొప్పులు జన్మలో రావు..!!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world