ప్రతీ ఒక్కరికి తాము అందంగా కనిపించాలని.. అందరూ తమ అందాన్ని పొగుడుతుంటే మురిసిపోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ అందం కోసం వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తూ.. బ్యీటూ పార్లర్లూ.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఈ ఐదు రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా రోజూ తీస్కుంటే… మీ చెక్కిళ్లు గులాబీ రంగులో మెరిసిపోతాయి. అయితే మన అందాన్ని మరింతగా పెంచే ఆ ఐదు ఆహార పదార్థాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిది అంజీర్ పండ్లు, అత్తి పండు ఆరోగ్యాన్నిమెరుగురుస్తుంది. దీన్ని నేరుగా లేదా ఖీర్, స్నాక్స్, సలాడ్స్ వంటి రూపంలో తీసుకోవచ్చు. అత్తి పండ్లను పాలలో ఉడికించి తీసుకోవడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది. రెండోది బచ్లికూర.. బచ్చలి కూర, పాలకూర వంటి ఆకు కూరలు, కూరగాయలు తినడం వల్ల శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. రక్త ప్రసరణపెరిగి చర్మం మెరుస్తుంది. మూడోది బాదం పప్పు.. బాదాం తనడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మెదడుకు చురుకుగా పని చేయడంలో, మనసును ప్రశాంతంగా ఉంచడంలో… బాదాం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే నాలుగోది ఆపిల్ రసం, తేనె.. యాపిల్ జ్యూస్ లో తేనె కలిపి తాగడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఈ రెసిపీ శరీరంలోని రక్త స్థాయిని పెంచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఐదోది బీట్ రూట్ జ్యూస్… రోజుకు ఒకసారి సలాడ్ లో బీట్ రూట్ తినాలి. లేదా బీట్ రూట్ జ్యూస్ తాగాలి. మీ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, రక్త ప్రసరణ మెరుగవుతుంది. అయితే ఇలా చేయడం వల్ల మీ చెంపలు… గులాబీ రంగులో తళుక్కుమంటాయి.