Weight loss drink : ఈ మధ్య చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకునేందుకు మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక నిరాశకు లోనవుతారు. అంతేనా వేలకు వేలు డబ్బులు ఖర్చులు చేస్తూ ఆస్పత్రులు, జిమ్ ల చుట్టు కూడా తిరుగుతుంటారు. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ… ఇంట్లో ఉండే సులువుగా అధిక బరువును తగ్గించుకోవచ్చు.

ముందుగా ఒక నిమ్మకాయను తీస్కొని శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసి నిమ్మరసాన్ని ఒక బౌల్ లోకి పిండాలి. ఆ తర్వాత నిమ్మ తొక్కలను చిన్న చిన్న ముక్కులుగా కట్ చేస్కోవాలి. నిమ్మకాయ పొత్తి కడుపు మరియు నడుము నుండి అదనపు కొవ్వును కరిగిస్తుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి లీటర్ నీళ్లను పొయ్యాలి. కొంచెం వేడి అయ్యాక రెండు అంగుళాల దాల్చిన చెక్క ముక్కును వేయాలి. దాల్చిన చెక్క పొడి అయితే ఒక స్పూన్ మొతాదులో వేయాలి. దాల్చిన చెక్క కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత ఒఖ స్పూన్ మిరియాలు వేయాలి. పొడి రూపంలో వేస్తే అరస్పూన్ మిరియాల పొడి సరిపోతుంది. మిరియాల్లో ఉండే పైపరిన్ శరీరంలో కొవ్వు కణాలు పేరుకుపోకుండా నిరోధిస్తుది.
జీవక్రియలు బాగా సాగేలా చేస్తుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ లు బాగా విడుదల అయ్యేలా చేసి తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను తురిమి వేయాలి. అల్లం జీవ క్రియలను వేగవంతం చేసి వేగంగా బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది. ఆ తర్వాత కట్ చేసి పె్టటుకున్న నిమ్మ తొక్కలను వేయాలి. నిమ్మ తొక్కలలో ఉండే పెక్టిన్ బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ ఈ డ్రింక్ తీస్కోవాలి. దీని ద్వారా అధిక బరువును సులువుగా తగ్గించుకోవచ్చు.
Read Also : Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా?ఈ డ్రింక్ తో మీ సమస్యకి చెక్ పెట్టవచ్చు..!