Weight Loss: ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్లలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అందరినీ ఎక్కువగా వేధిస్తున్న సమస్యలో అధిక బరువు సమస్య చాలా ప్రధానమైనది. శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పు రావడం వల్ల ఈ అధిక బరువు సమస్య ఎక్కువగా వేధిస్తోంది. అధిక బరువు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ అధిక బరువు సమస్య ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది. అందువల్ల ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి వ్యాయామాలు చేయటంతో పాటు డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.అధిక బరువు సమస్యను తగ్గించి డీటాక్స్ డ్రింక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇంట్లో లభించే మసాలా దినుసులతో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీనిటి ఉపయోగించి ఎన్నో ఆరోగ్యసమస్యలను తగ్గించవచ్చు. మన ఇంట్లో లభించే దాల్చిన చెక్క , తేనె ఉపయోగించి అధిక బరువు సమస్యని నియంత్రించవచ్చు. దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి . దీనిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఉదయం దాచిన చెక్క పొడి కలిపిన నీటిని తాగటం వల్ల శరీర బరువును తగ్గించవచ్చు. ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. ఆ నీటిలో రెండు చెంచాల తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
అంతేకాకుండా ఈ అధిక బరువు సమస్యను తగ్గించడానికి మరొక మార్గం జీలకర్ర నీళ్లు. జీలకర్రలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక గ్లాస్ నీటిలో కొంచం జీలకర్ర వేసి ఈ నీటిని బాగా మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని తాగాలి. ప్రతిరోజు ఇలా జీలకర్ర మరిగించిన నీటిని తాగటం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వుని కూడా కరిగించి వ్యర్థాల రూపంలో బయటికి పంపుతుంది. అంతే కాకుండా ఈ నీటిని ప్రతి రోజూ ఉదయం తాగటం వల్ల మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.