Samantha -Naga Chaitanya : సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడిపోయినప్పటికీ వీరి గురించి నిత్యం ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.స్వయంగా నాగార్జున వీరి విడాకుల విషయం గురించి ఆలోచించడం మానేయండి అంటూ వేడుకున్నప్పటికీ నేటిజన్స్ మాత్రం వీరి విడాకుల విషయంపై ఏదో ఒక వార్త అల్లుతూనే ఉంటారు. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత వీరి విడాకులకు ఎన్నో కారణాలను సృష్టించారు. అయితే తాజాగా వీరిద్దరు విడాకులకు మరొక కారణాన్ని కూడా సృష్టించారనే చెప్పాలి.సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నాగార్జున మేనకోడలుగా సుప్రియ ఇండస్ట్రీకి చెందిన చరణ్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.అయితే కొన్నాళ్లకే ఆయన దురాలవాట్లకు బానిస కావడంతో ఈమె చరణ్ నుంచి దూరంగా ఉన్నారు.ఇకపోతే తన భర్తతో విడాకులు తీసుకున్న అనంతరం సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈమె చాలా కాలం తర్వాత హీరో అడవి శేష్ తో కలిసి గూడాచారి సినిమాలో నటించారు.ఈ సినిమాలో వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడటంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు.
Samantha – Naga Chaitanya : సమంత నాగచైతన్య విడాకులకు ఎవరు కారణమంటే..?
ఇకపోతే వీరిద్దరి పెళ్లికి సమంత ఏ మాత్రం ఇష్టపడటం లేదని, వీరి పెళ్లి విషయంలో సమంత అడ్డుపడటంతో నాగచైతన్య సమంత మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది.ఇలా వీరిద్దరి మధ్య సుప్రియ విషయంలో రోజురోజుకు గొడవ పెద్దది కావటం వల్లే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి చివరికి విడిపోయే పరిస్థితులు ఎదురయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇలా సుప్రియ రెండవ వివాహానికి సమంత అడ్డుపడిందన్న కారణంతోనే విడాకులు తీసుకున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని అలా పోతే అక్కినేని ఫ్యామిలీలో చాలామంది విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్నారంటూ పలువురు భావిస్తున్నారు.ఇక సమంత విషయానికి వస్తే ఈమె కూడా నాగచైతన్య కన్నా ముందు సిద్ధార్థను ప్రేమించి తనతో బ్రేకప్ చెప్పుకున్న తర్వాతే నాగచైతన్యను పెళ్లి చేసుకున్నారని మరికొందరు ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World