Kiran Abbavaram And Rahasya expecting first child : సెలబ్రిటీ కపుల్, టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ సంతోషకరమైన విషయాన్ని కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. రహస్య బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. తన భార్యను వెనుక నుంచి ఆలింగనం చేసుకుని, ఆమె బేబీ బంప్‌ను పట్టుకుని ఉన్న ఫోటోను హీరో కిరణ్ అబ్బవరం షేర్ చేశాడు. తమ బిడ్డ కడుపులో పెరుగుతోందని పోస్టులో రాసుకొచ్చాడు. ‘మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది’ అని కిరణ్ ఫొటో క్యాప్షన్ ఇచ్చాడు. ఈ జంట ఫొటోలకు పలువురు నెటిజన్లు కంగ్రెట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Our love is growing by 2 feet 👣👼🐣 pic.twitter.com/69gL0sALaZ
Advertisement— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 21, 2025
Advertisement
కిరణ్ అబ్బవరం, రహస్య తమ మొదటి మూవీ రాజా వారు రాణి గారులో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి వెంటనే కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత, 2023 ఆగస్టులో కర్ణాటకలో జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం ఇటీవలే “కా” మూవీతో హిట్ కొట్టాడు. అతని కొత్త చిత్రం “దిల్రూబా” ప్రేమికుల రోజున విడుదల కానుంది.
Kiran Abbavaram : రహస్య గోరక్‌తో ప్రేమ, పెళ్లి..
ఏపీలోని రాయచోటికి చెందిన కిరణ్ అబ్బవరం సినీ ఇండస్ట్రీలోకి రాకముందు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చేసేవాడు. 2019లో రాజా వారు రాణి గారు మూవీతో సినిమాల్లోకి వచ్చాడు. ఎస్సార్ కల్యాణ్ మండపం మూవీతో కిరణ్ అబ్బవరంకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆపై, నేను మీకు కావాల్సినవాడిని, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణుకథ, సెబాస్టియన్ పీసీ 524, మీటర్, రూల్స్ రంజన్, క మూవీల్లో నటించి సినీప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రాజా వారు రాణి గారు మూవీలో నటించిన రహస్య గోరక్‌తో కిరణ్ పరిచయం కాస్తా ప్రేమగా మారి అది పెళ్లీపీటలకు వెళ్లింది. కుటుంబం, బంధువుల సమక్షంలో కిరణ్, రహస్య పెళ్లి జరిగింది.
దీపావళికి వచ్చిన కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ మంచి హిట్ టాక్ అందుకుంది. దాదాపు రూ. 50కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ‘దిల్ రుబా’ అనే మూవీలో కిరణ్ నటిస్తున్నాడు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వంలో జోజో జోస్, రవి, సారెగమ రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ అయింది. ఈ మూవీని ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున విడుదల కానుంది.