Bigg boss season 6 updates: బుల్లితెరపై భారీ పాపులారిటీని సొంతం చేస్కున్న బిగ్ బాస్ మరో కొత్త సీజన్ తో మన ముందుకు రాబోతుంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన టాప్ సీక్రెట్ ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు 5 సీజన్లు పూర్తి చేస్కున్న ఈ రియాల్టీ షోను ఇటీవలే ఓటీటీలోకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఈ సీజన్ 6 కోసం సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ నాలుగ తేదీ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోంది.
ఆరో సీజన్ కోసం ఏకంగా 21 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్లు తాజా సమాచార. ఇందులో ఒకరిద్దరు జబర్దస్త్ కమెడియన్లు విన్నాం. అయితే చివరి మూమెంట్ తో ఆమె ఈ షోకు రావని చెప్పినట్లు తెలుస్తోంది. ఆరో సీజన్ కంటెస్టెంట్లను షో కంటే ముందే తీసుకొచ్చి క్వారంటైన్ లో ఉంచాలని చూస్తున్న క్రమంలో అందులోంచి ఇద్దరు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ఉదయ భాను, దీపికా పిల్లి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీళ్లు ఈ సీజన్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికప్పుడు ఈ ఇద్దరి ప్లేస్ భర్తీ చేయడం కోసం వేట మొదలు పెట్టిందట బిగ్ బాస్ యాజమాన్యం. వీరి స్థానంలోనే మరో ఇద్దిరని ఫైనల్ చేసి… కంటెస్టెంట్లు అందరినీ మూడు జాబితాలుగా తయారు చేసి క్వారంటైన్ పంపిస్తున్నారని సమాచారం.