Balaiah NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రజెంట్ ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈయన వెండితెరపైన కనబడితే చాలు. అభిమానులు సంబురపడిపోతుంటారు. అటువంటిది బాలయ్య.. చాలా సార్లు సిల్వర్ స్క్రీన్‌పై తొడగొట్టి భయపెట్టే సీన్స్ చేశాడు. కాగా, బాలయ్యలోని మరో యాంగిల్ ఆహా ‘అన్ స్టాపెబుల్’ షో ద్వారా బయటపడుతోంది. లేటెస్ట్‌గా రిలీజైన ప్రోమోలో ఆ విషయం స్పష్టమవుతోంది.
బాలయ్య కాలేజీ రోజుల్లో అమ్మాయిలకు సైట్ కొట్టేవారట. టీనేజ్‌లో బైక్‌పై షికార్లు కొడుతూ అమ్మాయిల వేట కొనసాగించేవారు బాలయ్య. ఈ విషయాలన్నీ కూడా స్వయంగా బాలయ్యనే పేర్కొనడం గమనార్హం. ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ షోలో బాలయ్య తాజాగా మాస్ మహారాజా రవితేజ, ‘క్రాక్’ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిలను ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలోనే తన లైఫ్ రహస్యాలు బయటపెట్టేశాడు బాలయ్య. షోలో భాగంగా రవితేజను సరదా క్వశ్చన్స్ వేశాడు ‘అఖండ’ హీరో బాలయ్య. నువ్వు మొగల్రాజపురం అమ్మాయిలకు లైన్ వేస్తుండేవాడివట కదా అని రవితేజను అడిగాడు.
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ‘ఖిలాడీ’ హీరో రవితేజ మొహమాట పడ్డారు. అప్పుడు బాలయ్య బాబు ఓపెన్ అయిపోయాడు. తప్పేముందయ్యా.. మేము వేసే వాళ్లం చిన్నప్పుడు. ఆ రెడ్డి కాలేజీ చుట్టూ బైకులేసుకొని తెగ తిరిగేవాళ్లం .. అని బాలయ్య అన్నాడు.
అలా తాను టీనేజీ టైంలో అమ్మాయిలకు లైన్ వేసే విషయాన్ని స్వయంగా బాలయ్య షేర్ చేసుకున్నాడు. ఈ ప్రోమో ప్రజెంట్ నెట్టింట బాగా వైరలవుతోంది. ఇక ఈ ఎపిసోడ్‌లో బాలయ్యతో పలు విషయాలను రవితేజ షేర్ చేసుకున్నాడు. గోపీచంద్ మలినేని కూడా తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్నాడు. ‘సమర సింహారెడ్డి’ సినిమా చూడటానికి తను పడిన పాట్లు వివరించాడు.
Read Also : RRR Komuram Bheemudo Lyrics : RRR ‘కొమురం భీముడో’ పాట లిరిక్స్.. వింటేనే రోమాలు నిక్క పొడవాల్సిందే!