Airtel Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) తమ యూజర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. అందులో ప్రత్యేకించి వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇరు సంస్థలు ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి.
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలలో డేటా వద్దనుకొనేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ట్రాయ్ (TRAI) ఆర్డర్ తర్వాత, Jio, Airtel కొత్త వాయిస్ మాత్రమే రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు వినియోగదారులు తమకు అవసరం లేనప్పుడు డేటా కోసం చెల్లించాల్సిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ఆదేశాలను అనుసరించి, Jio, Airtel వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను తీసుకొచ్చాయి. కాలింగ్, SMS బెనిఫిట్స్ మాత్రమే అందించే రెండు కంపెనీల వెబ్‌సైట్‌లో ఇలాంటి ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నిర్ణయం 2G వినియోగదారులతో సహా డేటా అవసరం లేని వారికి పెద్ద ఉపశమనాన్ని అందిస్తుంది. కానీ, ఇప్పటి వరకు రీఛార్జ్ ప్లాన్‌లోని డేటా ధరను మాత్రమే చెల్లించాల్సి వచ్చింది. మొబైల్‌లో డేటాను ఉపయోగించని వారు ఇప్పటికీ దేశంలో కోట్లాది మంది ఉన్నారు.
Airtel Jio : ట్రాయ్ ఉత్తర్వులు జారీ :
టెలికాం రెగ్యులేటర్ డిసెంబర్ 23, 2024న వాయిస్-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకురావాలని అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం కంపెనీలకు ఒక నెల సమయం కూడా ఇచ్చింది. వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను మాత్రమే కలిగిన తమ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు కంపెనీలు అలాంటి ప్లాన్‌లను తీసుకురావాలని ఆర్డర్‌లో పేర్కొంది. డేటా అవసరం లేని వారికి ఇలాంటి ప్లాన్‌లు అవసరం. ఫీచర్ ఫోన్ వినియోగదారులతో పాటు, రెండు సిమ్‌లను ఉపయోగించే వారికి కూడా ఇది ప్రయోజనం కలిగిస్తుంది.
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు :
ట్రాయ్ ఆదేశాలను అనుసరించి, జియో రూ. 458, రూ. 1,958 ప్లాన్‌ను ప్రారంభించింది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఇందులో దేశవ్యాప్తంగా ఉచిత అపరిమిత కాలింగ్, 1,000 ఉచిత SMSలను పొందుతారు. ఇందులో మొబైల్ డేటా ఇవ్వలేదు. ప్లాన్‌తో జియో సినిమా, జియో టీవీ యాప్‌లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా రూ.1,958 ప్లాన్ 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిలో, మీరు ఉచిత కాలింగ్, మొత్తం 3,600 SMSలను పొందుతారు. ఇందులో మొబైల్ డేటా కూడా ఉండదు.
ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు :
జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా రెండు వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కంపెనీ రూ. 509 ప్లాన్‌లో 84 రోజుల పాటు అపరిమిత కాలింగ్, 900 SMSలను అందిస్తోంది. అదే సమయంలో, రూ. 1,999 ప్లాన్‌లో, వినియోగదారులు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, 300 SMSలను పొందుతారు.
Read Also : Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష..!