Prabhas New Look : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ప్రభాస్ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎక్కడికెళ్లినా ప్రభాస్ ఫ్యాన్స్, ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.. ప్రభాస్ ఏ మూవీ చేసినా డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. చేతి నిండా మూవీలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు ప్రభాస్.
ఇప్పటికే రాధేశ్యామ్ మూవీతో అలరించిన ప్రభాస్.. ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ పరిమితమైంది. ప్రభాస్ లుక్స్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ అయింది. నార్త్ ఆడియన్స్ ప్రభాస్ లుక్‌పై దారణంగా ట్రోలింగ్ చేశారు. ఆదిపురుష్ మూవీ చిత్రీకరణ సమయంలో ప్రభాస్ ఫోటోలపై నెగిటివ్ కామెంట్లు వచ్చాయి.
Prabhas New Look : డార్లింగ్ ప్రభాస్ స్టన్నింగ్ లుక్స్ వైరల్..
వాటిన్నింటికి బ్రేక్ వేస్తూ.. డార్లింగ్ ప్రభాస్ స్టన్నింగ్ లుక్స్‌తో ట్రోలర్లకు దిమ్మితిరిగేలా షాక్ ఇచ్చాడు. స్టైలీష్ లుక్‌లో కనిపించి ఔరా అనిపించాడు. ప్రభాస్ కొత్త లుక్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్లో ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలావరకూ పూర్తి అయింది. రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతి సనన్, సైఫ్ ఆలీ ఖాన్ కీరోల్స్ కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు.
Oka chinna cinema ne chupichadu 💥💥😍📸#Prabhas #Adipurush pic.twitter.com/nd92L4SU5E
— Adipurush 🏹🚩 (@__iamsk___) June 15, 2022
Read Also : Vishnu priya: చెడ్డీ వేస్కొని చెమటలు పట్టేలా వర్కవుట్ చేస్తోందిగా..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world