CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. 2025 బోర్డు పరీక్షలకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్‌లను పరీక్షా సంగం పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక షెడ్యూల్ ప్రకారం.. CBSE బోర్డ్ 2025 క్లాస్ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఒకే షిఫ్ట్‌లో నిర్వహిస్తారు. 10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 18న ముగియగా, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 14, 2025న ముగుస్తాయి.
సాధారణ విద్యార్థులు 10వ తరగతి 12 తరగతులకు సంబంధించి తమ పాఠశాలల నుంచి తమ CBSE బోర్డ్ 2025 అడ్మిట్ కార్డ్‌లను పొందవచ్చు. అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్షా కేంద్ర సమాచారం, సబ్జెక్ట్ వారీగా పరీక్ష తేదీలు, పరీక్ష సమయాలు, రిపోర్టింగ్ సమయం వంటి వివరాలు ఉంటాయి.
ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు CBSE 10వ తరగతి, 12వ తరగతి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ కింది సాధారణ దశలను పాటించాలి. భారత్, అంతర్జాతీయంగా 8వేల పాఠశాలల నుంచి సుమారు 44 లక్షల మంది విద్యార్థులు ఈ సంవత్సరం 10వ తరగతి, 12 తరగతుల బోర్డు పరీక్షలకు హాజరుకానున్నారు.
CBSE Admit Card 2025 : అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
- అధికారిక వెబ్‌సైట్ (cbse.gov.in)ని సందర్శించండి
- పరీక్షా సంగం పోర్టల్‌ని తెరవండి.
- ఇప్పుడు, ‘స్కూల్స్ (Ganga) ఎంచుకోండి.
- ‘Pre-Exam Activities’ ట్యాబ్‌కి వెళ్లండి.
- మెయిన్ పరీక్ష 2025 కోసం ‘అడ్మిట్ కార్డ్, సెంటర్ మెటీరియల్ లింక్’పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు, అవసరమైన లాగిన్ వివరాలను ఎంటర్ చేసి, ‘Proceed’పై క్లిక్ చేయండి.
- ఇది మిమ్మల్ని CBSE అడ్మిట్ కార్డ్ 2025కి రీడైరెక్ట్ అవుతుంది.
- మీ హాల్ టిక్కెట్‌పై వివరాలను చెక్ చేయండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అడ్మిట్ కార్డ్ ప్రింటవుట్ తీసుకోండి.
సీబీఎస్ఈ అడ్మిట్ కార్డుల కోసం చెక్ చేయాల్సిన వెబ్‌సైట్‌లు :
- cbse.gov.in
- cbse.nic.in
అనుసరించాల్సిన సూచనలివే :
సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టిక్కెట్‌లను పరీక్షా కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. పరీక్ష ప్రవేశ ద్వారం వద్ద అడ్మిట్ కార్డును చూపించిన తర్వాత మాత్రమే మీరు పరీక్షలో కూర్చోనేందుకు అనుమతిస్తారు.
విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే ముందు తమ అడ్మిట్ కార్డ్‌లలో అనుమతించిన అనుమతించని వాటి పూర్తి జాబితాను క్షుణ్ణంగా చదవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం, అధికారిక CBSE వెబ్‌సైట్‌ను చెక్ చేయండి లేదా సంబంధిత స్కూల్ అధికారులను సంప్రదించండి.