Telugu NewsDevotionalSurya Shukra Yuti : ఒకే రాశిలోకి సూర్యుడు, శుక్రుడు... ఈ 4 రాశుల వారు...

Surya Shukra Yuti : ఒకే రాశిలోకి సూర్యుడు, శుక్రుడు… ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!

Surya Shukra Yuti : మన భారత దేశంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన జీవితంలో జరిగే ప్రతి పనికి జ్యోతిష్య శాస్త్రం లో వివరణ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 12 రాశుల వారిని శుక్ర గ్రహం ప్రభావితం చేస్తుంది. శుక్ర గ్రహం శుభాలకు ప్రత్యేకంగా ఉంటుంది.

Advertisement

దీని ప్రభావం ఆ రాశులకు చెందిన వ్యక్తులపై నేరుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం శుక్ర గ్రహం సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాకుండా సూర్యుడు కూడా ఇప్పుడు సింహరాశిలోనే సంచరిస్తున్నాడు. సూర్యుడు శుక్రుడు రెండో కలిసి ఒకే రాశిలో సంచరించడం వల్ల నాలుగు రాశుల వారికి చెడు ఫలితాలు కలగజేస్తాయి. ఆ రాశుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

• శుక్రుడు, సూర్యుడు ఒకే రాశులు కలవడం వల్ల కన్యా రాశి వారికి ఆర్థిక నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కన్యా రాశి వారు ఆర్థిక వనరులను పెంచుకోవడమే కాకుండా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. ఏదైనా ముఖ్య పనులను ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నవారు కొంతకాలం వాటిని విరమించుకోవడం మంచిది.

Advertisement

• సూర్యుడు శుక్రుడు కలయిక వల్ల కుంభ రాశి వారి మీద కూడా చెడు ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు వివాదాల్లో చిక్కుకోవటమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వీలైనంతవరకు మౌనంగా ఉండటం మంచిది.

Advertisement

Advertisement

• కర్కాటక రాశి వారి మీద కూడా ఈ రెండిటి కలయిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు శుక్రుడు కలయిక వల్ల కర్కాటక రాశిలో జన్మించిన వారు ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఎందుకంటే ఈ రాశి వారు ఏ పనులు మొదలు పెట్టాలనుకున్న కూడా అవి నెరవేరవు. అంతేకాకుండా వీరి కుటుంబ సభ్యులకు కూడా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

• ఇక సూర్యుడు శుక్రుడు సింహరాశిలో కలయిక వల్ల మిధున రాశి వారికి కూడా చెడు సమయం నడుస్తోంది. ఈ రాశి వారు ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారంలో కూడా భారీ నష్టాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు