Diwali 2022 : ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వస్తోంది. దీపావళి వెళ్లి వెళ్లగానే కొందరి రాశుల వారికి ఎప్పుడులేని అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టనుంది. ఇన్నాళ్లు దురదృష్టం వెంటాడిన వీరిని ఈసారి అదృష్టం గట్టిగా పట్టేసుకోనుంది. ఆస్ట్రాలజీ ప్రకారం.. ఏదైనా గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరించినప్పుడు ఆ ప్రభావం మనపై పడుతుందంటారు.

గ్రహాల్లో బుధుడు అక్టోబర్ 26న (బుధవారం) తులారాశిలో సంచరించనున్నాడు. బుధుడి ప్రభావం చేత అన్నిరాశుల వారికి బిజినెస్ వంటి ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం పడుతుంది. ఇంతకీ ఏయే రాశులకు బుధుడు అనుగ్రహిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మీ రాశి ఏమైనా ఉందో లేదో ఓసారి చూసుకోండి.
కుంభ రాశి :
ఈ కుంభ రాశి వారికి మంచి రోజులు మొదలయినట్టే. బుధుడు తులారాశిలో సంచరించనున్నాడు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడుతుంది. పోటీ పరీక్షలకు ప్రీపేర్ అయ్యే రాశి వారు తప్పక విజయం సాధించే అవకాశం ఉంది. బుధుడు సంచారం పదవ ఇంట్లో ఉంటుంది. దాంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ ఆఫీసులో మీదే ఆధిపత్యం కొనసాగుతుంది. కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం లభిస్తుంది.
Diwali 2022 : ఏయే రాశులవారిికి అదృష్టమంటే..
ధనుస్సు రాశి :
బుధ గ్రహం సంచారంతో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోవచ్చు. వ్యాపారంలో బాగా రాణించే అవకాశం ఉంది. మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడులు ఆర్థికంగా కలిసి రావొచ్చు. కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఊహించని మార్పులను చూడవచ్చు. అదృష్టం అంటే మీదే అన్నట్టుగా అనిపిస్తుంది. అదృష్ట రత్నంగా పుష్యరాగం రత్నం ధరిస్తే ఎంతో మంచిది.

కన్య రాశి :
ఈ రాశివారికి అదృష్టం వరించనుంది. ఈ రాశి నుంచి రెండవ ఇంట్లో బుధుడు సంచారించనున్నాడు. అదే సమయంలో మీకు ఆకస్మిక ధనం పొందవచ్చు. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. వ్యాపారం చేసే వారికి చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. అదే సమయంలో మీ కీర్తి ప్రతిష్టలను పొందుతారు. మార్కెటింగ్ వంటి ఇతర రంగాలకు చెందిన వారి ఉన్నత స్థానానికి చేరుకునేందుకు అడుగులు పడతాయి. ఒక్కరకంగా చెప్పాలంటే ఈ అద్భుతమైన సమయం వారికి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
Read Also : Rashmika Mandanna : ఆ స్టార్ హీరోతో ఆ పనికి ఒప్పుకున్న రష్మిక మందన.. డబ్బు కోసం మరి ఇలా తెగించాలా?